NTV Telugu Site icon

CM KCR: బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటన… మధ్యాహ్నం 2.30కి కేసీఆర్ ప్రెస్ మీట్..

Cm Kcr List

Cm Kcr List

CM KCR: సోమవారం మధ్యాహ్నం అధికారిక బీఆర్‌ఎస్‌ తొలి జాబితా విడుదలకు సమయం ఖరారైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై పలు కసరత్తులు చేశారు. సోమవారం తొలి జాబితా ప్రకటిస్తామని ప్రకటించినా.. ఇప్పుడు మధ్యాహ్నం 2.30 గంటలకు సమయం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి కారు ఎక్కేదెవరో తేలిపోవడంతో ఈ జాబితాపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సిట్టింగులకు సీట్లు ఇవ్వరాదంటూ ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే అభ్యర్థులు ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బారులు తీరారు.

Read also: Alleti Maheshwar Reddy: ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం.. ఉద్రిక్తత..

మధ్యాహ్నం కేసీఆర్ ప్రెస్ మీట్ ప్రారంభించి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రకటించిన అనంతరం జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితాను మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల చేసేందుకు కేసీఆర్ సమయం ఫిక్స్ చేశారు. ఇప్పటి వరకు 10 మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. ఈమేరకు కవిత, హరీశ్ రావు వివరణ ఇచ్చారు. తొలి జాబితాలో 95 నుంచి 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తారు. మిగతా వారి జాబితాను వచ్చే శుక్రవారం ప్రకటిస్తారు. ఎమ్మెల్యే కవిత, మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూధనాచారి ఇప్పటికే ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. అయితే ఈసారి 11 మంది సిట్టింగులకు కేసీఆర్ టికెట్ నిరాకరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. 105 మంది అభ్యర్థులను కేసీఆర్ విడుదల చేయనున్నారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 25న కేసీఆర్ విడుదల చేస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2.30కి కేసీఆర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ వాతావరణం నెలకొంది.
Asia Cup 2023: ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. శ్రేయస్‌, రాహుల్‌ వచ్చేశారు! తెలుగోడికి ఛాన్స్‌