Site icon NTV Telugu

KCR : నరేంద్ర మోడీ తెలంగాణకు చేసింది ఏమీలేదు

Kcr Bus Yatra

Kcr Bus Yatra

మహబూబాబాద్ రోడ్డు షో లో బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నా మీదా నిషేధం పెట్టిందని, మారుమూల ప్రాంతం అయిన మహుబాబాద్ అభివృద్ధి కోసం మహబూబాబాద్ ను జిల్లా చేసుకున్నామన్నారు. ఈ ప్రభుత్వం మాహుబాబాద్ జిల్లా ను తీసేస్తా అని చెబుతుందన్నారు కేసీఆర్‌. మహబూబాబాద్ జిల్లా ను సీఎం తిషేస్తా అంటున్నాడని, మహబూబాబాద్ జిల్లా ఉండాలి అంతే మలోతు కవిత ను గెలిపించాలనన్నారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి అంటే కాంగ్రెస్ ను ఉడగొట్టాలని, మహబూబాబాద్ కి నీళ్లు రాలేదన్నారు. కాలువలు తవ్వలేదని, కాల్వల్లో నీళ్లు ఇవ్వలేదన్నారు కేసీఆర్‌. ఎన్నికల కమిషన్ నా మీదా నిషేధం విధించిందని, 48 గంటల పాటు నిషేధం పెట్టిందని, ఈ ఎన్నికల కమిషన్ నీ పేగులు మెడల వేసుకుంటా నీ గుడ్లు పీకుతా అన్న రేవంత్ రెడ్డి పైనా నిషేధం పెట్టలేదన్నారు. కానీ నా మీద మాత్రం ఎన్నిక కమిషన్ నిషేధం పెట్టింది.. మా కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహం తో పని చేస్తారన్నారు కేసీఆర్‌.

అంతేకాకుండా..’నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తకపోతే అన్న మన ముఖ్యమంత్రి లో నోరు ఇవ్వడం లేదు. అమలుకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఓట్లు వేపిచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లేదు నెరవేరుతలేవు. ఒక ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ నెరవేరలేదు. నాలుగోలు మాటలు చెప్పే కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి. నరేంద్ర మోడీ తెలంగాణకు చేసిన ఏం లేదు. 15 లక్షలు ఇస్తా అన్న నగదు ఏ ఒక్కరికి రాలే. రైతుబంధు ఎవరికి రాలేదు. రైతుకూలీలకిస్తున్న 12000 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. వడ్లు కొనే పరిస్థితి లేదు. రైతులకు 500 బోనస్ ఇస్తా అన్నది ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం బంజారాల కోసం ఎంతో చేసింది. కేంద్రంలో ఉన్న బిజెపి గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని గిరిజనులు పట్టించుకున్న దాఖలలో. బీఆర్ఎస్ పాలల్లో ఎలాంటి ఉండేది ఇప్పటి పాలన ఎలా ఉందో చూసి ఓట్లు వేయండి. తెలంగాణకి అన్యాయం జరగవద్దు అని పోరాటం చేస్తున్న. తెలంగాణ హక్కులు కాపాడాలంటే మహబూబాబాద్ లో మాలోతు కవిత ఓటు వేయాలి..’ అని కేసీఆర్‌ అన్నారు.

Exit mobile version