KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు కొత్త ప్రతిపాదన
- 7 ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాసులకు బదులుగా ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన
- ఒకే కారిడార్ ద్వారా ప్రధాన ట్రాఫిక్‌ను మళ్లించే యోచన
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మార్గాల్లో ట్రాఫిక్ తగ్గించే లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KBR Park Elevated Corridor: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకి సంష్కారం దిశగా కీలక మార్పు చోటు చేసుకుంది. పార్క్ చుట్టూ ప్రతిపాదించిన 7 ఫ్లై ఓవర్స్, 7 అండర్ పాస్‌లకు బదులుగా.. ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే దిశగా ప్రణాళికలో మార్పులు జరుగుతున్నాయి. తాజా ప్రతిపాదనలో ట్రాఫిక్ ని ఒకే కారిడార్ ద్వారా వేగంగా తరలించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
కేబిఆర్ పార్క్ పరిసరాల్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్ నగర్ వైపు వెళ్లే మార్గాల్లో తరుచూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు H సిటి ప్రాజెక్ట్ లో భాగంగా గతంలో 7 స్టీల్ ఫ్లై ఓవర్స్, 7 అండర్ పాస్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు దశల ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.1090 కోట్లుగా ఉంది.
Also Read
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
అయితే.. తాజా ప్రతిపాదన ప్రకారం అనేక చోట్ల విడివిడిగా ఫ్లై ఓవర్స్ అండర్ పాసెస్ నిర్మించడానికి బదులుగా ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ద్వారా ప్రధాన ట్రాఫిక్ ని మల్లించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. దీనివల్ల పలు జంక్షన్స్ వద్ద సిగ్నల్స్ దగ్గర వాహనాలు ఆగాల్సిన అవసరం తగ్గించాలి అనేది లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా తుది నిర్ణయం వెలుబడలేదు.
కేబిఆర్ పార్క్ పరిధిలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పార్క్ ఎంట్రెన్స్, రోడ్ నెంబర్ 45, ఫిలింనగర్, మహారాజ అగ్రసేన జంక్షన్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ముగ్దా జంక్షన్ వంటి ప్రాంతాలు గత ప్రణాళికలో కీలకంగా ఉన్నాయి. కేబిఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మార్గంలో ఫ్లై ఓవర్ పనులకు సంబంధించి తవ్వకాలు మట్టి పరీక్షలు వంటి పనులు ఇప్పటికే చేపట్టినట్లు గతంలో అధికారులు వెల్లడించారు.
నిర్మాణ పనుల కారణంగా ఈ మార్గంలో ట్రాఫిక్ మల్లింపులు కూడా అమలు చేశారు. పార్క్ చుట్టూ భారీ రహదారి నిర్మాణాలపై పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. గత ప్రతిపాదనలపై దాదాపు 1300 చెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందనే నివేదికలు వెలుబడ్డాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు పార్క్ పర్యావరణాన్ని కాపాడటం కూడా కీలక అంశంగా మారింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న H సిటీ ప్రణాళిక ప్రకారం కేబిఆర్ పార్క్ పరిసరాల్లో చేపడుతున్న మౌలిక వసతుల పనులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 14 వేరువేరు రోడ్డు నిర్మాణాలకు బదులుగా ఒకే ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనకు సంబంధించిన తుది రూపకల్పన అమలు విధానం వీటికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!