Kaun Banega Crorepati 17: అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 17 మొదటి కోటీశ్వరుడిని చేసింది. తాజాగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో ఉత్తరాఖండ్‌కి చెందిన ఆదిత్య కుమార్, అత్యంత ప్రతిష్టాత్మకమైన రూ.1 కోటి ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే, ఆ తర్వాత ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో ఆటను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కోటి రూపాయలు గెలుచుకున్న ఆదిత్య కుమార్.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 17లో మొదటి కంటెస్టెంట్ అయ్యాడు.
Read Also: Irfan Pathan: అతడు అడిగితే నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తా.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రూ. 1 కోటి ప్రశ్న: ఈ క్రింది మూలకాలలో ఏది ప్లూటోనియాన్ని విడదీసిన శాస్త్రవేత్త పేరు మీదుగా చెప్పబడింది?.. అదే ప్లూటోనియం మొదటి అణుబాంబు తయారీలో ఉపయోగించబడింది..?
ఆప్షన్లు:
A. సీబార్గియం
B. ఐన్‌స్టీనియం
C. మైట్‌నేరియం
D. బోహ్రియం
ఈ ప్రశ్నకు ఆదిత్య కుమార్ “50-50” లైఫ్‌లైన్ ఉపయోగించుకుని చివరికి A (సీబార్గియం) అనే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. అది కరెక్ట్ సమాధానం కావడంతో వెంటనే, అమితాబ్ బచ్చన్ తన ప్రత్యేకమైన శైలిలో అభినందించారు. దీంతో కంటెస్టెంట్ ఆదిత్య బిగ్ బీ కాళ్లకు నమస్కరించి, తన తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు. అనంతరం.. సీబార్గియం (ఎస్‌జీ) అమెరికన్ కెమిస్ట్ గ్లెన్ టీ. సీబార్గ్ పేరుమీదుగా పెట్టబడింది. ఆయన తన బృందంతో కలిసి 1940లో ప్లూటోనియాన్ని వేరు చేశారు. చరిత్రలో ఒక మూలకం తన పేరుమీదుగా పెట్టబడిన ఏకైక శాస్త్రవేత్త ఈయనే. ఈ మూలకం నాగసాకి అణుబాంబులోనూ ఉపయోగించబడింది.
Read Also: Viral Video: మీ పిల్లలు మొబైల్స్ కు బానిసలయ్యారా..? ఒక్కసారి ఈ వీడియో చూపించండి!
ఏడు కోట్ల ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన ఆదిత్య..
ప్రశ్న: 1930లలో భారత్‌ను సందర్శించి, తాజ్ మహల్, సాంచీ స్తూపం, ఎల్లోరా గుహలను చిత్రించిన జపాన్ చిత్రకారుడు ఎవరు?..
ఆప్షన్లు:
A. హిరోషిమా సుగిమోటో
B. హిరోషి సెన్జు
C. హిరోషి యోషిదా
D. హిరోషి నకాజిమా
అయితే, రూ. 7 కోట్ల ప్రశ్నకు ఆదిత్య కుమార్‌కు సరైన సమాధానం తెలియకపోవడంతో షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వెళ్ళేముందు ఏదో ఒకటి చెప్పాలని బిగ్ బీ సూచించగా.. ఆప్షన్ D (హిరోషి నకాజిమా) ని ఎంపిక చేసుకున్నాడు. కానీ అది తప్పు.. సరైన సమాధానం C (హిరోషి యోషిదా) అని అబితాబ్ బచ్చన్ తెలిపారు. కాగా, 1876లో జన్మించిన హిరోషి యోషిదా, 1920లో వుడ్‌బ్లాక్ ప్రింట్లను రూపొందించడం ప్రారంభించారు. 1930లో భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో నాలుగు నెలల పాటు పర్యటించి, 32 వుడ్‌బ్లాక్ ప్రింట్ల సిరీస్ ను రూపొందించారు. భారతదేశంలోని ప్రత్యేకమైన కాంతి గుణం అతడ్ని బాగా ఆకట్టుకుంది. తన చిత్రాల్లో దానిని ప్రతిబింబించారు.
Aditya Kumar become the first crorepati of the season! Will he create history by winning 7 crores! pic.twitter.com/lqp9zua8DF
— Sony LIV (@SonyLIV) August 20, 2025
