టాలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటి ప్యారడైజ్. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ప్యారడైజ్ దాదాపు వంద కోట్ల బడ్జెట్ పై SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇటీవల జాయిన్ అయ్యారు.
Also Read : OTT : ఈ వారం బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇవే
తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో హీరోయిన్ కయాడు లోహర్ జాయిన్ అయింది. ఆమెకు సంబంధించిన కీలక సన్నివేశాలను నైట్ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ కయాడు లోహర్ 40 రోజుల డేట్స్ ఇచ్చింది. కేవలం గ్లామర్ పాత్ర కాకుండా, కథలో చాలా కీలకమైన పాత్రగా ఉండబోతోందని యునిట్ వర్గాల సమాచారం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కయాడు లోహర్ పాత్రను చాలా స్పెషల్ గా డిజైన్ చేశారట. అటు నేచురల్ స్టార్ నాని కూడా పూర్తిగా కొత్త లుక్, కొత్త షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మార్చి 26న రిలీజ్ కాబోతుంది. అందుకు తగ్గట్టే షెడ్యూల్ ను ప్లాన్ చేసి షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ అంచనాలను పెంచేసింది. గతంలో ‘దసరా’తో భారీ విజయం సాధించిన నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అన్నది చూడాలి.
