Site icon NTV Telugu

Kawasaki Versys-X 300: బండిని చూస్తేనే నడిపేయాలనిపించే కావసాకీ వర్సిస్-X 300 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇలా..!

Kawasaki Versys X 300.

Kawasaki Versys X 300.

Kawasaki Versys-X 300: అడ్వెంచర్ బైక్‌ కోసం ఎదురుచూస్తున్న భారతీయ నీకె లవర్స్ కు కావసాకీ ఇండియా శుభవార్త తీసుకవచ్చింది. కావసాకీ వర్సిస్-X 300 మళ్లీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అవును మీరు విన్నది నిజమే.. ఎందుకంటే, వర్సిస్-X 300కు భారత్‌లో తొలిసారి కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ బైక్ కొన్ని సంవత్సరాల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, ఆ తరువాత మార్కెట్ నుంచి తొలగించబడింది. ఇప్పుడు 2025 వర్షన్‌లో బైక్ తిరిగి లాంచ్ చేయబడింది. ప్రస్తుతం ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎం 390 అడ్వెంచర్ వంటి బైక్‌లకు గట్టి పోటిగా నిలవనుంది. మరి ఈ అడ్వెంచర్ బైక్‌ ధర, స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..?

Read Also: Lava Shark 5G: రూ.7,999కే 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో లావా షార్క్ లాంచ్..!

డిజైన్, స్టైలింగ్:
కావసాకీ వర్సిస్-X 300 బైక్ పెద్ద వర్షన్‌ల తరహాలోనే ఒక స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ప్రత్యేకమైన హెడ్‌లాంప్ డిజైన్‌తో పాటు పెద్ద వైడ్‌స్క్రీన్ దీని ప్రత్యేకత. సైడ్ ఫేరింగ్ డిజైన్ కూడా పెద్ద వర్సిస్ బైక్‌లను తలపిస్తుంది. బైక్‌ క్యాండీ లైం గ్రీన్ టైపు 3 విత్ మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ల్ బ్లాక్, మెటాలిక్ ఓషన్ బ్లూ విత్ పెరల్ రోబోటిక్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలలో లభ్యమవుతాయి.

శక్తివంతమైన ఇంజిన్, పనితీరు:
ఈ బైక్ OBD-2B కంప్లయింట్ 296cc లిక్విడ్ కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజిన్ తో వస్తోంది. ఇదే ఇంజిన్ నింజా 300లో కూడా ఉంది. ఇది 40 హెచ్‌పీ పవర్, 25.7 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ట్రాన్స్‌మిషన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అండ్ అసిస్టు క్లచ్ కలిగి ఉంటుంది.

Read Also: War 2 Update: చల్ హట్.. యుద్ధానికి ముందు టైగర్‌ను చూశారా?

ఛాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్:
వర్సిస్-X 300 బైక్ హై టెన్సైల్ స్టీల్ బ్యాక్‌బోన్ ఫ్రేమ్ పై ఆధారపడింది. ముందు భాగంలో 130 మిమీ ట్రావెల్ కలిగిన టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక 148 మి.మీ ట్రావెల్ కలిగిన మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్‌కు ముందు 290 మిమీ సింగిల్ డిస్క్ డ్యూయల్ పిస్టన్ కలిపర్, వెనుక 220 మిమీ డిస్క్ బ్రేక్ ఇవ్వబడ్డాయి. వీటిని 19 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక స్పోక్ వీల్స్ ఉండనున్నాయి.

ఫీచర్ల పరంగా ఈ బైక్ సింపుల్ డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్, డ్యూయల్ ఛానెల్ ABS వంటి అవసరమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. మరి ఇన్ని ఫీచర్లు ఉన్న దీని ధర రూ. 3.80 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించబడింది.

Exit mobile version