Site icon NTV Telugu

Kavya Maran : సన్ రైజర్స్ గెలిచింది.. కావ్య పాప నవ్విందిరోచ్చ్..

Kavya Smile

Kavya Smile

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్ కు మధ్యలో ధావన్ తన ఇన్సింగ్స్ తో భయపెట్టినప్పటికి.. బ్యాటింగ్ లో ఎలాంటి తడబాటుకు లోనవ్వకుండా 144 పరుగుల టార్గెట్ ను చేధించింది. అయితే ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో ఎదురైన ఓటములతో తెగ బాధపడిపోయిన ప్రాంఛైజీ కో- ఓనర్ కావ్య మారన్ ఎట్టకేలకు నవ్వింది.. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ కు హాజరైన ఆమె మొత్తం ఎంకరేజ్ చేస్తు కనిపించారు. తొలుత బౌలర్లు చెలరేగి వికెట్లు తీయడంతో సంతోషంగా ఎగిరి గెంతులేసింది. ఆఖర్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కెరీర్ బెస్ట్ ఇన్సింగ్స్ ఆడుతుంటే బిక్కమొహం వేసుకుని కూర్చొంది.

Also Read : Shikar Dhawan: థాంక్యూ హైదరాబాద్‌.. విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్

అయితే 144 పరుగుల టార్గె్ట్ ను ఎస్ ఆర్ హెచ్ ఛేదిస్తుందో లేదో అన్న టెన్షన్ ఆమె ముఖంలో క్లియర్ గా కనిపించింది. అయితే రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్ లు జట్టును విజయతీరాలకు చేర్చిన తర్వాత పట్టరాని సంతోషంతో ఆమె మొహంలో నవ్వులు విరపూశాయి. మంచి ఇన్సింగ్స్ తో ఆకట్టుకున్న త్రిపాఠి, మార్ర్కమ్ ల వైపు సూపర్ అంటూ థంబ్స్ అప్ చూపిస్తూ నవ్వడం హైలెట్ గా నిలిచింది. తొలి రెండు మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటములతో డీలా పడిన కావ్య మారన్ ఎట్టకేలకు నవ్వడంతో అభిమానులు ఉప్పొంగిపోయారు. కావ్య పాప నవ్విందిరోచ్చ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read : IPL 2023 : కావ్య పాపకు కోపం వచ్చిందోచ్

Exit mobile version