Site icon NTV Telugu

Kavitha: నేను బీఆర్‌ఎస్‌లో లేను.. రైతుల పక్షాన ఉంటాను..!

Kavitha

Kavitha

Kavitha: నిజామాబాద్‌ జిల్లా యంచలో జరిగిన కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి నది ముంపు ప్రాంతాల్లో పంట నష్టం జరగడానికి మంత్రులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. కవిత మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులు, అధికారుల పాపం, నిర్లక్ష్యం వల్లే పంట నీట మునిగింది. ముంపు బాధిత రైతులకు ఎకరానికి రూ.50 వేలు పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్ మరోసారి సర్వే చేయించాలని ఆమె కోరారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేసి ఉంటే ముంపు ఈ స్థాయిలో ఉండేది కాదని కవిత అభిప్రాయపడ్డారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ.. సగం పంట అమ్ముకున్నాకే ప్రభుత్వం ధాన్యం కొంటుందని విమర్శించారు. వరి పంటకు మద్దతు ధర, బోనస్ రావడం లేదని, అలాగే మొక్కజొన్న, పసుపు పంటకు కూడా మద్దతు ధర ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Motorola G96 vs Motorola Edge 60 Fusion: మొటొరోలా లవర్స్.. మిడ్ రేంజ్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏదంటే..!

ఇటీవల బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ వ్యవహారంపై స్పందించిన కవిత, ఆయనకు చురకలు అంటించారు. ఇటీవల షకీల్ హైదరాబాద్‌కి వెళ్లినట్లు ఉన్నారు.. వచ్చిపోవడం కాదు.. వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయాలని కవిత హితవు పలికారు. అలాగే ఆమె తెలంగాణ సంస్కృతి, రైతుల హక్కుల గురించి మాట్లాడుతూ.. తెలంగాణ చేతిలో నుంచి బతుకమ్మను తొలగించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బోనస్, బతుకమ్మ చీరలు, తులం బంగారం రావాలంటే పిడికిలి ఎత్తి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే కవిత మాట్లాడుతూ.. “నేను బీఆర్‌ఎస్‌ పార్టీలో లేను కానీ, రైతుల పక్షాన ఉంటాను. బీఆర్‌ఎస్‌లో ఉన్నా, లేకున్నా, రైతుల పక్షానే ఉంటా” అని స్పష్టం చేశారు. ముంపు బాధిత రైతుల కోసం భారీ స్థాయిలో పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు.

Cardamon Benefits: రోజుకు రెండంటే.. రెండు చాలు.. ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోను..!

Exit mobile version