Kavitha: నాకు కూడా టైం వస్తుంది.. నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలిపారు.. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతనని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఇంకా చిట్టా విప్పలేదు.. ఇది కేవలం టాస్ మాత్రమే అన్నారు. దీనికే ఉలిక్కి పడితే ఎలా? త్వరలోనే మీ అవినీతి, అక్రమాలపై టెస్ట్ మ్యాచ్ ఉండబోతోందన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని తనపై రుద్దే ప్రయత్నం చేయొద్దని.. తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడి తోలు తీస్తా అన్నారు.
READ MORE: HBD Rajinikanth: ‘రజనీ’ రొమాన్స్ సూపర్ హిట్.. తన కంటే 37 ఏళ్ల చిన్న హీరోయిన్‌తో..!
హిల్ట్ పాలసీకి కిటికీలు తెరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అని.. గతంలో బీఆర్ఎస్ బాటలు వేస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ రహదారులు వేస్తోందని కవిత ఆరోపించారు. “కేటీఆర్ హయాంలో అనేక చెరువులు ప్రైవేట్ బిల్డర్లకు డెవలప్ మెంట్ కోసం ఇచ్చారు. అందులో ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ బిల్డర్స్ కు ఇచ్చారు. ఇందులో మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్ గా ఉన్నారు. మాధవరం కృష్ణారావు వెనుక ఉన్న గుంట నక్కను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ పదేళ్లలో నేను, నా భర్త కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధిపొందలేదు. మీకు దమ్ముంటే నేను మీ మీద చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి. వెక్కిలి చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అవసరం అయినప్పుడు నా నగలు కుదువ పెట్టి బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించాను. తాను హరీశ్ రావుపై ఆరోపణలు చేస్తే బీజేపీ ఎందుకు మాట్లాడుతోంది.” అని కవిత ప్రశ్నించారు.