Off The Record: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కవిత పార్టీ వైపు మొగ్గుతున్నారా?
- ఈనెల 25న కవిత పార్టీ జెండా, అజెండా, పేరు ప్రకటన..
- భారీ ఎత్తున పార్టీ ఆవిష్కరణకు సన్నాహాలు..
- కొత్త పార్టీలో చేరికలపై రకరకాల చర్చలు..
- సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న కవిత..
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కవిత పార్టీ వైపు మొగ్గుతున్నారా? ..
- ఈసారి టిక్కెట్ రాదన్న డౌట్ ఉన్నవాళ్ళు అటు చూస్తున్నారా?..
- పార్టీకి హైప్ కోసమే కవిత స్టేట్‌మెంట్స్ అంటూ మరో వాదన..
- ఒకవేళ చేరికలున్నా ఎన్నికల నాటికేనన్న చర్చలు..
- ఇప్పట్నుంచే టచ్‌లో ఉన్నా నో ప్రాబ్లమ్ అంటున్న కవిత వర్గం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటవబోతోంది. జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కవిత సొంత పార్టీకి సర్వం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన కసరత్తు చివరి దశలో ఉందట. ఈనెల 25న హైదరాబాద్‌లో పార్టీ పేరు, జెండా, అజెండా గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారామె. పార్టీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడో కొత్త చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా జరుగుతోంది. కవిత ఏర్పాటు చేయబోయే పార్టీలో ఎవరెవరు చేరతారు? ఇతర పార్టీల నుంచి ఉంటారా అంటూ రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా ఆ విషయానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. తమ పార్టీలోకి చాలా మంది నేతలు వచ్చి చేరతారని, అందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ మీడియా చిట్‌చాట్‌లో చెప్పారామె. తాను పెట్టబోయే పార్టీలో చేరతామంటూ మండల, జిల్లా స్థాయి నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సంప్రదిస్తున్నట్టు చెప్పుకొచ్చారామె.
సరిగ్గా ఈ పాయింట్ మీదే ఇప్పుడు గట్టిగా ఫోకస్ చేశాయి రాజకీయవర్గాలు. స్వయంగా కవిత నోటి నుంచే ఆ మాటలు రావడంతో… మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఆ ఎమ్మెల్యేలు ఎవరా అంటూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారు చాలామంది. ఇదే ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హాట్ టాక్. దానికి సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ నుంచిగాని, కేంద్రంలో పవర్ ఉన్న బీజేపీ నుంచిగాని కవితవైపునకు మళ్ళే అవకాశం లేదు. ఇక మిగిలి ఉన్నది బీఆర్‌ఎస్. కవిత మూలాలు ఆ పార్టీలోనే ఉండటం, పాత పరిచయాలు, ప్రస్తుత పరిస్థితులు అన్నీ కలిపి చూస్తే… బీఆర్‌ఎస్ శాసనసభ్యులే అటువైపు మొగ్గుతుండవచ్చని అంటున్నారు. కవిత కూడా పరోక్షంగా ఇదే విషయం చెబుతున్నారట. దీంతో కొత్త పార్టీలో చేరే గులాబీ ఎమ్మెల్యేలు ఎవరా అంటూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు మనస్ఫూర్తిగాలేరు, అధిష్టానం మీద గుర్రుగా ఉన్నవాళ్లు ఎవరా అంటూ ఎంక్వైరీలు మొదలైపోయాయి. అదే సమయంలో మరో వాదన సైతం తెర మీదికి వస్తోంది. ఒకవేళ నిజంగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా అసంతృప్తితో ఉంటే…. ఇటు కాంగ్రెస్‌లోకో, అటు బీజేపీలోకో వెళ్తారుగానీ… కొత్తగా పెడుతున్న కవిత పార్టీవైపు ఎందుకు చూస్తారన్న వాదన సైతం ఉంది.
Also Read
కానీ… వచ్చే ఎన్నికల్లో గులాబీ టిక్కెట్ రాదని అనుమానం ఉన్నవాళ్ళు అటువైపు చూడవచ్చు కదా అన్నది ఇంకో వెర్షన్. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు అనుబంధం ఉన్నవాళ్ళు, ఉద్యమకారులకు ఎక్కువ అవకాశాలు ఇస్తామని చెబుతున్నారు కవిత. కాబట్టి మొదటి నుంచి బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీపై అయిష్టంతో కవిత వెంట నడిచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే… తన పార్టీకి హైప్ తీసుకురావడం కోసమే కవిత అలా మాట్లాడుతున్నారు తప్ప… వాస్తవానికి అంత సీన్ లేదన్నది ఇంకొందరి మాట. ఎలా ఉంటుందో, ఏమవుతుందో క్లారిటీ లేని పార్టీలోకి ఇప్పుడే వెళ్ళే సాహసం ఎమ్మెల్యేలు ఎవరూ చేయబోరన్నది వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ ఎవరైనా… కవిత పార్టీలో చేరాలని అనుకున్నా సరే… ఎన్నికల సమయానికి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటారు తప్ప…. ఇప్పటికిప్పుడు టెంప్ట్ అవబోరని అంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు ఇప్పటినుంచి తమతో టచ్‌లో ఉండి అసెంబ్లీ ఎన్నికల సమయానికి తమ పార్టీలోకి వచ్చినా నో ప్రాబ్లమ్… ఆల్వేస్ వెల్కమ్ అని అంటున్నారు కవిత అనుచరులు. మొత్తం మీద కొత్త పార్టీ పుట్టకముందే చేరికల లొల్లి మాత్రం గట్టిగానే మొదలైంది.
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!