Kavitha: కవిత ‘TRS’ పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
Kalvakuntla Kavitha: ఇది ప్రారంభం మాత్రమే, ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోందని.. ఒక రాజకీయ నేతను అలా అనకూడదు.. కానీ, అనాల్సి వస్తుందన్నారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా.. సీఎం మాట్లాడట్లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. అందుకే కర్కోటకుడని అంటున్నాం.. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం, రెండేళ్ల తర్వాత మనదే అధికారమన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో కొత్త పార్టీ పేరు ప్రకటించిన ఆమె రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించారు. “1. విద్య: ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం.. 2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.. 4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 5. సామాజిక న్యాయం సాధించాల్సిందే” అని ప్రకటించారు.
అనంతరం బీఆర్ఎస్, కేసీఆర్ గురించి కవిత మాట్లాడారు. “మన కేసీఆర్ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారు. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. జాతీయ పార్టీ పెడతానని చెప్పారు. సింగరేణిలో గనిలో కార్మికుడు చనిపోతే చూసొచ్చే వ్యక్తి. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు. కేటీఆర్ మాట్లాడారంటే అనుకోవచ్చు. ఆయనకు రాజకీయం తెలియదు. ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. ఇళ్లను కూల్చుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి కేసీఆర్ ఎక్కడున్నారు..? మారుతారేమోనని చూశా.. కానీ, నన్నే సస్పెండ్ చేశారు. ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే తాను మాట్లాడాల్సింది. కానీ, మాట్లాడలేదు.. ఇవాళ నాకు అదే జరిగింది. ఉద్యమంలో కొట్టినవారినే తీసుకొచ్చి పట్టం కట్టారు. వాళ్ల అనుచరులు మనవాళ్లను అణగతొక్కారు. ఉద్యమకారులను నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా సరిపోయేది. కండువా వేసుకొని అప్పుడు పిచ్చొల్లలాగా తిరిగాం. ఆ పార్టీలో అమ్మతనం పోయింది, మమకారం పోయింది. అందుకే కేసీఆర్ మన కేసీఆర్ కాదు. మరబొమ్మ అయ్యారు.” అని కవిత వ్యాఖ్యానించారు.
Also Read
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
- Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!
- Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్..
తాజావార్తలు
-
Kavitha: కవిత ‘TRS’ పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
-
Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
-
Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
-
Cancer Awareness: మీ శరీరంలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే అది క్యాన్సర్ కావచ్చు.. చెక్ చేసుకోండి!
-
Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!