Kathireddy Pedda Reddy React on Supreme Court Verdict: వైసీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎంట్రీకి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ సుప్రీంకోర్టును మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలని కూడా పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘నేను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీకి అందజేస్తా. త్వరలోనే నేను తాడిపత్రి వెళ్తాను. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా, సేవ చేస్తా. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తాను’ అని పెద్దారెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకి భారీ కుట్ర.. బయటకొచ్చిన సంచలన వీడియో!
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా, ఓడినా.. తాడిపత్రిలో మాత్రం ఫ్యాక్షనిజం చేస్తానన్నారు. దీంతో టీడీపీ నేతలు కొంత కాలంగా ఆయన్ను తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఆ మధ్య తాడిపత్రిలోని తన నివాసానికి బయల్దేరిన పెద్దారెడ్డిని మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంటరై పెద్దారెడ్డిని వాహనంలో ఎక్కించుకొని అనంతపురం తీసుకెళ్లారు. జేసీ వర్సెస్ కేతిరెడ్డి కారణంగా కొంతకాలంగా తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
