Separate Country: బీహార్‌లోని ఒక పాఠశాలలో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న పెద్ద వివాదాస్పదంగా మారింది. కాశ్మీర్‌ను భారతదేశం నుంచి వేరుచేసే ప్రశ్న ఉందని ఆరోపిస్తూ దుమారం చెలరేగింది. ఈ ఘటన బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో గల పాఠశాలలో జరిగింది. బిహార్ ప్రభుత్వ విద్యా శాఖ 1-8 తరగతుల విద్యార్థులకు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 18 వరకు మధ్యంతర పరీక్షలను నిర్వహించగా.. ఆంగ్ల పరీక్షలో ఓ ప్రశ్ అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే.. క్రింది దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు? అని పరీక్షలో ప్రశ్న అడిగారు.
కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఉదాహరణకు చైనా వారిని చైనీస్ అని పిలుస్తారని.. నేపాల్, ఇంగ్లాండ్, కాశ్మీర్, భారతదేశ ప్రజలను ఏమని పిలుస్తారు? అంటూ అడిగారు. ఇందులో కశ్మీర్‌ను వేరే దేశంగా పొరపాటున రావడంతో వివాదం చెలరేగింది. అంతేగాదు ఈ వివాదం కాస్త చిలికిచిలికి రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇది పొరపాటు కాదని కావాలనే ఇలా చేశారని కిషన్‌గంజ్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ సుశాంత్ గోపీ విమర్శించారు. నితీష్ సర్కారు పిల్లల మనసుల్లో కశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసి చూపించే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.
దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్కే దాస్ వివరణ ఇచ్చారు. ఇది పొరపాటు వల్లే జరిగిందని.. అంతకు మించి ఇంకేం లేదన్నారు. ఈ ప్రశ్నాపత్రంలో కశ్మీర్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉండటానికి బదులు కశ్మీర్ దేశ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి సుభాష్ కుమార్ గుప్తా కెమెరాలో ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: ‘ఖర్గే గారిని అడగండి’.. ఫలితాలకు ముందే పార్టీ చీఫ్‌ను ప్రకటించిన రాహుల్
మరోవైపు విద్యావేత్తలు, బీజేపీ నేతలు ఈ వ్యవహారం కుట్ర అని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రితో విచారణ జరిపించాలని కోరారు. బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ తన సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం చిత్రాన్ని పంచుకున్నారు. కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదని వారు భావిస్తున్నారనే ఆందోళనపై బిహార్ ప్రభుత్వం ఇప్పటికీ మౌనంగా ఉందని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి కావాలనే కోరికతో నితీష్ కుమార్ ఎంత అశాంతిగా ఉన్నారని, 7వ తరగతి పిల్లలపై దేశ వ్యతిరేక ప్రశ్నపత్రాలను ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అచ్చం ఇలానే ఐదేళ్ల క్రితం 2017లో బిహార్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఇదే ప్రశ్న ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు బీహార్ విద్యాశాఖ తన తప్పుని సరిచేసుకోలేకపోవడం బాధాకరం. ఈ మేరకు ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడటమే కాకుండా సదరు టీచర్‌ని తొలగించాలంటూ ట్వీట్ చేశారు.
