తెలంగాణలో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా టీడీపీ నేతలు అంటున్నారు. ఇక, కాసాని మాట్లాడుతూ.. చంద్రబాబు కోరితే ఖమ్మం మీటింగ్ పెట్టాను.. తర్వాత నిజామాబాద్ లో మీటింగ్ పెట్టాలన్నారు.. ఇంటింటికీ టీడీపీ అని 41వ ఆవిర్భావ సభ పెట్టించారు అంటూ ఆయన తెలిపారు.
Read also: Electoral Bonds Scheme: ఆ హక్కు ప్రజలకు లేదు.. రాజకీయ పార్టీల విరాళాలపై సుప్రీంకు కేంద్రం
ఇక, చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసి వచ్చాను అని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. నేను ఫోన్ చేస్తే.. నారా లోకేష్ లిఫ్ట్ చేయలేదన్నారు. తెలంగాణలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళే నిలబడాలని నిర్ణయం తీసుకున్నాం.. చంద్రబాబు ఎన్నికల్లో నిలబడటం లేదని చెప్పారు.. నన్ను ఎందుకు పార్టీలో పిలిచారు అని చంద్రబాబును అడిగాను.. అభ్యర్థులు తయారయి ఉన్నారు.. క్యాడర్ కు పార్టీలో ఉండి న్యాయం చేయలేను.. అందుకే టీడీపీకి రాజీనామ చేస్తున్నాను అని ఆయన వెల్లడించారు. రేపు నా క్యాడర్ ను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.. ఎందుకు అభ్యర్థులను పోటీ చేయట్లేదు అనేది చంద్రబాబు చెప్పడం లేదు అంటూ కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.