NTV Telugu Site icon

Kasam Venkateswarlu : రేవంత్‌కి జాబ్ క్యాలెండర్ దొరకలేదా?

Kasam Venkateswarlu

Kasam Venkateswarlu

రేవంత్ కు పరిపాలన చేత కావడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాం వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు. ఇవాళ ఆయన బీజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతో చిక్కడ్ పల్లి లైబ్రరీ లో మోకాళ్ళ మీద నిలబడి నిరుద్యోగుల దగ్గర ఓట్లు అడిగారన్నారు. రేవంత్ కి జాబ్ క్యాలెండర్ దొరకలేదా? అని ఆయన ప్రశ్నించారు. నెల రోజులుగా నిరుద్యోగులను అరెస్ట్ లు చేస్తున్నారని, ఏటా 3 నుంచి 5శాతం ఉద్యోగులు రిటైర్డు అవుతారని ఆయన అన్నారు. ఆ పోస్టులను భర్తీ చేయడం లేదని, 1970 లో శ్యాక్షన్ అయిన పొస్తులనే కంటిన్యూ చేస్తున్నారు తప్ప కొత్త పోస్టులు పెంచడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నిర్యోగులతో చర్చించే దమ్ము లేదా? అని కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు , నిరుద్యోగులతో అఖిల పక్షం మీటింగ్ ఏర్పాటు చేయాలని, రేవంత్ ముందస్తు హౌస్ అరెస్టులు చేసి….కేసిఆర్ కంటే రెండింతల తప్పులు చేస్తున్నారన్నారు. నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం చెపించలేదా? అని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’తమ గోడు వివరించేందుకు నిరుద్యోగులు సెక్రటేరియట్ కి వెళ్తే వారిని అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేయడం ఎంటి? గతంలో హౌస్ అరెస్టుల మీద మాట్లాడిన సెల్ఫ్ డిక్లరేషన్ మేదావులు కోదండరాం, ఆకునూరి మురళీ, హరగోపాల్ ఎందుకు మాట్లాడటం లేదు ? ప్రభుత్వ తాయిలలకు ఏమైనా లొంగిపోయారా? యూనివర్సిటీ చదువుకునే పరిస్థితి లేదు. అక్కడ కొత్త వారిని ఎవరిని రానివ్వడం లేదు. రేవంత్ యూనివర్సిటీ లో ఎప్పుడైనా చదువుకొని ఉంటే తెలిసేది. అక్కడ ఎక్కడ చదివాడో ఏమీ చదువాడో ఎవరికి తెలియదు. సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఉంటున్నారు. ఇదేమైనా పోలీస్ పాలనా ? కేసీఆర్ దొంగ అయితే రేవంత్ గజ దొంగ.’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.