విజయ సంకల్ప అభియాన్ పేరుతో ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమమన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతగా ఈ నెల 15, 16వ తేదీల్లో ఉంటుందని, బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వరకు ఇందులో భాగస్వామ్యం అవుతారన్నారు. హైదర్ గూడ ముత్యాల బాగ్ పోలింగ్ బూత్ 26 లో కిషన్ రెడ్డి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. జ్యోతీ నగర్ – కరీం నగర్ లో బండి సంజయ్, నారాయణపేట లో డీకే అరుణ, మేడ్చల్ – ఈటెల రాజేందర్, ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి సంకల్ప పత్రం ఇచ్చి… స్టికర్ అంటిస్తామని ఆయన వెల్లడించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి కుటుంబాల నుంచి రాజకీయంగా విముక్తికావాలని కోరుకుంటున్న ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారన్నారు. బీజేపీఎంపీ అభ్యర్థి గెలుపు ఖాయం అన్నారు.
ఇప్పటికే ఆ కుటుంబాలకు అయిదు ఎమ్మెల్యే పదవులు, రెండు మంత్రి పదవులు ఉన్నా ఎంపీ కావాలనుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పదవుల కోసం తప్ప ఏనాడు ప్రజలకోసం వారు ఆలోచించడంలేదన్నారు. కరవుతో పంటలు ఎండిపోతున్నా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏనాడో పూర్తి కావాల్సిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేయకుండా అడ్డుకున్నది ఎవరో చెప్పాలని మంత్రులను ప్రశ్నించారు. ఏముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల్లో అమలు చేసింది ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఇంకా చేయలేదని ఆరోపించారు. ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా కేంద్రం నిధలు ఇస్తుందని.. అందుకే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
