కార్తీక మాసం మొదలైంది.. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. అందుకే కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో దీపాలతో ఎక్కువగా పూజలు చేస్తారు.. చన్నీటి స్నానం చేసి, ఉదయాన్నే దీపాన్ని వెలిగిస్తారు. అంతేకాదు ఈ మాసంలో తులసి పూజను కూడా చేస్తారు.. అలా తులసికి ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు.. ఎందుకో ఇప్పుడు వివరంగా కార్తీకమాసంలో విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు, మహా లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కకు పూజలు చేస్తారు. తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం..
కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్టే అని చెబుతున్నారు.. ఈ మాసంలో తులసి పూజ చెయ్యడం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుందని, వైకుంఠానికి నేరుగా చేరే అవకాశం దొరుకుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.. నిత్యం తులసి మొక్కను పూజించడం వల్ల అనేక రకాల కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి.. అంతేకాదు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.. తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు..
ఇకపోతే ఈ మాసంలో ఉసిరి మొక్కకు, తులసి కొమ్మకు పెళ్లి కూడా చేశారు.. ఇలా చెయ్యడం వల్ల విష్ణువుకు, మహా లక్ష్మీకి పెళ్లి చేసినట్లు భావిస్తారు.. అలాగే తులసి మొక్కను దక్షిణం వైపు నాటకూడదు. ఎందుకంటే ఈ దిశ యమ భగవానుడు, పూర్వీకులకు సంబంధించినది అందుకే ఉత్తరం లేదా తూర్పు, ఈశాన్య దిశలలో ఏదో ఒకవైపు తులసి మొక్కను నాటడం శుభప్రదం.. ఉత్తరం దిశలో నాటితే లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు.. ఇది కార్తీక మాసంలో తులసి పూజ వెనుక ఉన్న అసలు కథ..