NTV Telugu Site icon

RX 100 Sequel: ‘ఆర్ఎక్స్ 100’ సీక్వెల్ ప్లాన్ బయటపెట్టిన కార్తికేయ

Karthikeya

karthikeya Comments on RX 100 Sequel: హీరో కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురు లంక 2012’ రిలీజ్ కి రెడీ అయింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో కార్తికేయ ముచ్చటిస్తూ పలు కీలక మైన వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఎక్స్ 100’లో మీ క్యారెక్టర్ శివ, గోదావరి నేపథ్యంలో కథ! ‘బెదురులంక 2012’లోనూ మీ పేరు శివ, ఇదీ గోదావరి నేపథ్యంలో తీసిన సినిమానే ఇది ఒక సెంటిమెంట్‌ అనుకోవచ్చా? అని అడిగితే ఇదంతా యాదృశ్చికంగా జరిగిందని అన్నారు.

Posani Krishna Murali: నన్ను హత్య చేసేందుకు లోకేష్‌ కుట్ర.. నేనే చచ్చిపోతే ఆయనదే బాధ్యత..!

కథ నచ్చి రెండు సినిమాలు చేశానని, క్యారెక్టర్ పేరు శివ అని కథ చెప్పినప్పుడు క్లాక్స్ నాతో అనలేదని అన్నారు. చాలా రోజుల తర్వాత అతనికి ఈ విషయం గుర్తు చేశానని తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు గుర్తు లేదన్నాడు కానీ ఆ క్యారెక్టర్, మైండ్ సెట్ కు శివ పేరు సెట్ అవుతుంది కాబట్టే పెట్టానని చెప్పాడు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ, హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నామని కార్తికేయ అన్నారు. ఇక ఈ క్రమంలో ‘ఆర్ఎక్స్ 100’కు సీక్వెల్ ఆశించవచ్చా? అని అడిగితే ‘ఆర్ఎక్స్ 100 – 2’ అని కాదు కానీ అజయ్ భూపతి, నేను కలిసి ఓ సినిమా చేయాలని ప్లాన్ ఉందని అన్నారు. దానికి సరైన కథ కుదరాలి, కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం అన్నీ కుదిరినప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేస్తామని అన్నారు.