NTV Telugu Site icon

Bhaje Vaayu Vegam : కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ అదిరిపోయిందిగా..

Bhaje Vaayu Vegam

Bhaje Vaayu Vegam

Bhaje Vaayu Vegam :  టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కార్తికేయ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో కార్తికేయ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం లభించలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజ‌యాన్ని అందుకున్నాడు.ప్రస్తుతం కార్తికేయ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’. ఈ సినిమాను ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది.

Read Also :Naga Chaitanya :ప్రభాస్ బుజ్జిని నడిపిన నాగ చైతన్య..

ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్  ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ఈ  సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈక్ర‌మంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా వుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ప్రేక్షకులను ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ బాగా వైరల్ అవుతుంది.

Show comments