NTV Telugu Site icon

Karthika Mahotsavam 2023: నేటి నుండి శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు.. భక్తులు ఇవి గమనించాలి..

Srisailam

Srisailam

Karthika Mahotsavam 2023: తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ కనిపిస్తోంది.. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ.. దీపాలు వెలగిస్తూ.. దేవదేవుడికి మొక్కకుంటారు.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నారు. ఈ కార్తీకమాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది. ఇక, ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఇవాళ్టి నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ఈ మాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.. ఎందుకంటే.. కార్తీకమాసమంతా భక్తుల రద్దీ దృష్ట్యా సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆలయ పాలకమండలి.. ఇక, కార్తీక శనివారం, ఆదివారం, సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో కూడా స్పర్శ దర్శనాలు రద్దుచేశారు.. రద్దీ రోజుల్లో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తారు. కార్తీకమాసం సాధారణ రోజులలో అంటే.. వీకెండ్‌, వారం ప్రారంభంలో.. కాకుండా మిగతా రోజుల్లో.. స్పర్శ దర్శనానికి 4 విడతలుగా అనుమతి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. భక్తులు కార్తీక దీపాలు వేలిగించేందుకు శివ మాడవిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది శ్రీశైల మల్లికార్జునస్వామి దేవస్థానం.

Read Also: Rocking Rakesh: ‘కేసీఆర్’పై చేస్తున్న నా సినిమాని ఎలక్షన్ కమీషన్ ఆపేసింది