Site icon NTV Telugu

Karthi New Movie: ’96’ డైరెక్ట‌ర్‌తో కార్తీ.. సినిమా పేరు, ఫ‌స్ట్ లుక్ వైర‌ల్‌!

Meiyazhagan

Meiyazhagan

Karthi’s Meiyazhagan First Look: తమిళ స్టార్ హీరో కార్తీ, ’96’ డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ్‌కుమార్ ఏ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కార్తీ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసింది.

కార్తీ, ప్రేమ్‌కుమార్ సినిమాకు ‘మెయ్యళగన్’ అనే పేరును ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సీనియర్ నటుడు అర‌వింద్ స్వామి సైకిల్‌ను తొక్కుతుండగా.. కార్తీ వెనుక కూర్చుని హాయిగా నవ్వుతున్నాడు. మరో పోస్ట‌ర్‌లో కార్తీ ఎద్దును పట్టుకున్నాడు. సినిమా పేరు, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ సోషల్ మీడియాలో వైర‌ల్‌ అయ్యాయి. కార్తీ పుట్టినరోజు సందర్భంగా ‘మెయ్యళగన్’ పేరుతో విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.

Also Read: Hardik-Natasa Divorce: హార్దిక్ పాండ్యాకు షాక్.. నటాసా స్టాంకోవిచ్‌కు 70 శాతం ఆస్తి!

మెయ్యళగన్ సినిమాలో అరవింద్ స్వామి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. కార్తీ, అరవింద్ స్వామి మధ్య ఉన్న స్నేహ బంధం అర్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచెల్ రెబెక్కా, ఆంథోనీ, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్ నటించారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కుంభకోణం, శివగంగైలోని అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించబడింది. ప్రస్తుతం ఎడిటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి.

 

Exit mobile version