Site icon NTV Telugu

Karthi : లోకేష్ కనకరాజ్ పై అసంతృప్తి.. సూపర్ హిట్ సీక్వెల్ నుండి కార్తీ ఔట్..

Kaithi 2

Kaithi 2

కోలీవుడ్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ మార్చి సినిమాటిక్ యూనివర్శ్ అనే కొత్త వర్డ్, వరల్డ్ సృష్టించాడు డేరింగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఫస్ట్ మూవీ మానగరం తో సెన్సేషన్ క్రియేట్ చేసి సెకండ్ పిక్చర్ ఖైదీతో ఓవరాల్ సినీ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. లోకీ టేకప్ చేసిన ఏ మూవీ కూడా ఇప్పటి వరకు బోల్తా పడిన దాఖలాలు లేవు. కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి మార్కెట్, ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడు యంగ్ డైరెక్టర్. ఇళయ దళపతితో మాస్టర్, లియో, కమల్ తో విక్రమ్ సినిమాలు లోకిని కోలీవుడ్ దర్శకుల జాబితాలో టాప్ చైర్‌లో కూర్చోబెట్టాయి. కానీ క్రెజ్ ను ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయాడు లోకి.

మల్టీస్టార్లర్స్‌తో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు లోకేశ్ కనగరాజ్. రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. ఆ సినిమా రిజల్ట్ లోకేష్ కనకరాజ్ పై ఎఫెక్ట్ చూపించింది. అయితే కూలీ సినిమాను ఫినిష్ చేసిన వెంటనే కార్తీ తో ఖైదీ 2 ఉంటుందని ఆ మధ్య ప్రకటించాడు కార్తీ. ఇటు కార్తీ కూడా ఖైదీ2 కోసం రెడీ అవుతున్నాను అని గతంలో ప్రకటించాడు. కానీ కూలీ ఎఫెక్ట్ తో కార్తీని వదిలేసి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో సినిమా ప్రకటించాడు లోకేష్ కనకరాజ్. అందుకు సంబంధించి ప్రకటన కూడా వచ్చేసింది. లోకి తీరుతో అప్సెట్ అయిన కార్తీ కూడా ఇక ఖైదీ 2 ను వదిలేసి తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సర్దార్ కు సీక్వెల్ గా సర్దార్ 2 ను సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు.

Exit mobile version