Site icon NTV Telugu

PM Narendra Modi: కర్ణాటక ‘డబుల్‌ ఇంజిన్‌’ ఇతర దేశాలకు సవాల్‌ విసురుతోంది..

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narendra Modi: కర్ణాటకను కీలక పెట్టుబడి గమ్యస్థానంగా పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అనేక రంగాలలో రాష్ట్రంలో వేగవంతమైన వృద్ధికి ‘డబుల్ ఇంజిన్‌’ ప్రభుత్వ శక్తే ఒక కారణమని అన్నారు. మూడు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, ‘ఇన్వెస్ట్ కర్ణాటక 2022’లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభోపన్యాసం చేస్తూ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం గురించి నొక్కిచెప్పడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాదాపు ఐదు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో దాదాపు 500 ఫార్చూన్ కంపెనీలు ఉన్నాయని, దేశంలోని 100కు పైగా యూనికార్న్‌లలో 40కి పైగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ క్లస్టర్‌లలో కర్ణాటక ఒకటిగా పేరుగాంచిందన్నారు. పరిశ్రమల నుంచి ఐటీ వరకు, ఫిన్-టెక్ నుంచి బయోటెక్ వరకు, స్టార్టప్ నుంచి స్థిరమైన శక్తి వరకు పురోగతిలో కొత్త రికార్డులు సృష్టిస్తు్న్నాయన్నారు. కర్నాటక భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాకుండా, కొన్ని దేశాలకు కూడా సవాలు విసురుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ప్రతిభ, సాంకేతికత గురించి మాట్లాడినప్పుడల్లా, మనస్సులో మొదట కనిపించే పేరు ‘బ్రాండ్ బెంగళూరు’ అని ఆయన అన్నారు. కొవిడ్ తర్వాత దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను కలుసుకోవడం ఇదే తొలిసారి.

Honey Trap: బీజేపీ ఎమ్మెల్యేకు వలపు వల.. వాట్సాప్‌లో నగ్నంగా వీడియో కాల్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులను స్వాగతించిన ప్రధాని మోదీ.. కర్ణాటక సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశమని కొనియాడారు. ప్రకృతి, సంస్కృతుల గొప్ప సమ్మేళనమన్నారు. కర్ణాటక అత్యంత అందమైన సహజమైన హాట్‌స్పాట్‌లకు ప్రసిద్ధి చెందిందన్నారు. మృదు భాష కన్నడ, ఇక్కడి గొప్ప సంస్కృతి, కన్నడిగులలో అందరి పట్ల ఉన్న అభిమానం అందరి హృదయాలను గెలుచుకుందని ఆయన అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ పోటీ, సహకార సమాఖ్యవాదానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Exit mobile version