Karnataka vs MP: అహ్మదాబాద్ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025–26లో భాగంగా ఎలైట్ గ్రూప్ A మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు కర్ణాటకపై 160 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. కేవలం 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
Punjab vs Mumbai: సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ వృధా.. ఉత్కంఠ పోరులో పంజాబ్ ఒక్క పరుగుతో విజయం..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 47.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయింది. కర్ణాటక ఇన్నింగ్స్ లో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్ 35 పరుగులు చేయగా, చివర్లో విద్యాధర్ పాటిల్ 34 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించాడు. అయితే మధ్యప్రదేశ్ బౌలింగ్ లైనప్ దెబ్బకు కర్ణాటక బ్యాటర్లు నిలవలేకపోయారు.
మధ్యప్రదేశ్ తరఫున శివాంగ్ కుమార్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపుకు తిప్పేసాడు. 10 ఓవర్లలో 45 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు శివాంగ్. అతనికి తోడు కుమార్ కార్తికేయ, త్రిపురేష్ సింగ్, ఆర్యన్ పాండే లు చెరో వికెట్ తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కర్ణాటక నిర్ణీత ఓవర్లు కూడా ఆడలేకపోయింది.
ఇక 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ బ్యాటింగ్ మొదటి నుంచే దూకుడుగా సాగింది. ఓపెనర్లు యశ్ దూబే (40), హిమాన్షు మంత్రి (34) పరుగులతో జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లోనే 65 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించించి మ్యాచ్‌ను వన్ సైడ్ గా మార్చేశాడు. అతనికి తోడుగా త్రిపురేష్ సింగ్ 12 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలవడంతో లక్ష్యాన్ని వేగంగా చేరుకుంది మధ్యప్రదేశ్ జట్టు. కేవలం 23.2 ఓవర్లలోనే 208/3 స్కోర్ చేసి 160 బంతులు మిగిలుండగానే ఘన విజయాన్ని అందుకుందింది. 5 వికెట్ల ప్రదర్శనకు గాను శివాంగ్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Madhya Pradesh win 👏
Venkatesh Iyer finishes it off in style 😎
They chase down 208 in 23.2 overs against Karnataka 👌
A commanding win in a crucial match 🔥
Scorecard ▶️ https://t.co/szHbOWqpZK#VijayHazareTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/9v4WdTXk03
— BCCI Domestic (@BCCIdomestic) January 8, 2026
