Site icon NTV Telugu

Karnataka: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత.. స్పీకర్ ఉత్తర్వులు..!

Karnataka Assembly

Karnataka Assembly

Karnataka: కర్ణాటక అసెంబ్లీలో రెండు నెలల క్రితం అనుచిత ప్రవర్తన కారణంగా ఆరు నెలల పాటు సస్పెండ్ చేయబడ్డ 18 బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని స్పీకర్ ఖాదర్ ఆదివారం అధికారికంగా ఎత్తివేశారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత ఆర్. అశోక, న్యాయ శాఖ మంత్రి హెచ్.కే. పాటిల్‌లతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. మార్చి 21న బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో వారిపై “అనుచిత ప్రవర్తన” ఆరోపణలతో సస్పెన్షన్ విధించబడింది. ఆ సమయంలో ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీ చుట్టూ చేరి ఆందోళన చేపట్టారు. కొంతమంది కాగితాలు విసిరి హల్చల్ సృష్టించడంతో, వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు తరలించాల్సి వచ్చింది.

Read Also: Pat Cummins: ఈ ఏడాది మాది కాదు.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇక తాజాగా జరిగిన సమీక్ష సమావేశం అనంతరం స్పీకర్ ఖాదర్ మీడియాతో మాట్లాడుతూ.. అది ఒక నిర్బంధ పరిస్థితిలో జరిగిన సంఘటన. అయితే నేటి సమావేశంలో మంత్రులు, ప్రతిపక్ష నాయకులు కలిసి చర్చించి సస్పెన్షన్ ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఎమ్మెల్యేలు మా శత్రువులు కాదు, మిత్రులే అని అన్నారు. అంతేకాక, ఈ నిర్ణయాన్ని శాసనసభ వచ్చే సమావేశంలో అధికారికంగా ఆమోదిస్తారు. అన్ని పార్టీలు సంఘర్షణకు బదులు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలి. బీజేపీ ఎమ్మెల్యేలు తమ తప్పును గ్రహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అని అన్నారు.

Read Also: Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు!

సస్పెన్షన్ ఎత్తివేతపై కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కూడా ముఖ్యమంత్రి, స్పీకర్‌ లకు లేఖ రాశారు. అలాగే కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శోభా కరంద్లాజే వంటి నాయకులు కూడా స్పీకర్‌ను సంప్రదించారు. ప్రతిపక్ష నేత అశోక ఈ విషయంలో అనేకసార్లు స్పీకర్‌ను కలిశారు. ఆయన నుంచి లిఖితపూర్వకంగా క్షమాపణల లేఖ కూడా అందిందని ఖాదర్ వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తివేసిన ఎమ్మెల్యేలలో ముఖ్యంగా దొడ్డనగౌడ జి. పాటిల్‌, మాజీ డిప్యూటీ సీఎం సి.ఎన్. అశ్వత్ నారాయణ్, ఎస్.ఆర్. విశ్వనాథ్, బి.ఏ. బసవరాజు, బి.పి. హరీష్, చంద్రు లామాణి, మునిరత్న తదితరులు ఉన్నారు.

Exit mobile version