మనుషులను చంపే విష పూరితం అయిన వాటిల్లో ఒకటి పాములు.. ఇక కొండచిలువ విషపూరీతం కాకున్నా కూడా మనిషుల వల్ల తన హానీ కలుగుతుందని భావించి ముందుగానే మనుషులను చంపే ప్రయత్నం చేస్తాయి.. వీటిని చూస్తేనే జడుసుకునేవారు ఉంటారు. కానీ ఓ వ్యక్తి చీకట్లో, చెట్ల పొదల్లో దాక్కున్న పెద్ద కొండచిలువను ఒంటిచేత్తో బయటకు లాగేశాడు.. దాన్ని ఎలా కంట్రోల్ చేశాడు.. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ వీడియోను చూస్తుంటే ఈ ఘటన కర్ణాటక లో వెలుగు చూసిందని తెలుస్తుంది.. కొండచిలువ చీకట్లో, చెట్ల పొదల్లో నక్కి ఉంది. కర్ణాటకకు చెందిన స్నేక్ క్యాచర్ నవీన్ తన చెయ్యిని చెట్ల పొదల్లో దూర్చి ఒక్కసారిగా కొండచిలువను బయటకు లాగాడు.. ఆ కొండ చిలువ పరిమాణం చూస్తే పక్కాగా షాకవడం ఖాయం. అతను దాన్ని పట్టుకున్నంత సేపు అది అతని కడుపు భాగాన్ని, ఆ తరువాత మెడను చుట్టేసి అతన్ని చంపేయాలని ప్రయత్నించడం ఆ వీడియో చూడవచ్చు..
ఆ కొండచిలువ పదే పదే ప్రయత్నం చేస్తున్నా అతను తన నముడుకు, మెడకు చుట్టుకున్న కొండచిలువను సున్నితంగా చేతులతో విడిపించుకుంటాడు. చివరికి దాన్ని ఒక సంచిలో వేసేవరకు ఆ వీడియోను తీసినట్లు ఉంది.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో వీడియో వైరల్ అయ్యింది.. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొండ చిలువ పట్టిన వ్యక్తిని జాగ్రత్తగా ఉండమని కొందరు సలహా ఇస్తుండగా, మరికొందరు అతని ధైర్యానికి అవాక్కవుతున్నారు. ‘ఇంత భారీ కొండచిలువను పట్టుకోవడం నేను మొదటిసారి చూస్తున్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు… ఇక కొందరేమో అన్నో ఏందన్నా నీ ధైర్యం అని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది..