Viral video: అన్నో.. ఏందన్నా నీ ధైర్యం.. పొదల్లో దాక్కున్న కొండచిలువను ఒంటి చేత్తో తీసుకొచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషులను చంపే విష పూరితం అయిన వాటిల్లో ఒకటి పాములు.. ఇక కొండచిలువ విషపూరీతం కాకున్నా కూడా మనిషుల వల్ల తన హానీ కలుగుతుందని భావించి ముందుగానే మనుషులను చంపే ప్రయత్నం చేస్తాయి.. వీటిని చూస్తేనే జడుసుకునేవారు ఉంటారు. కానీ ఓ వ్యక్తి చీకట్లో, చెట్ల పొదల్లో దాక్కున్న పెద్ద కొండచిలువను ఒంటిచేత్తో బయటకు లాగేశాడు.. దాన్ని ఎలా కంట్రోల్ చేశాడు.. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ వీడియోను చూస్తుంటే ఈ ఘటన కర్ణాటక లో వెలుగు చూసిందని తెలుస్తుంది.. కొండచిలువ చీకట్లో, చెట్ల పొదల్లో నక్కి ఉంది. కర్ణాటకకు చెందిన స్నేక్ క్యాచర్ నవీన్ తన చెయ్యిని చెట్ల పొదల్లో దూర్చి ఒక్కసారిగా కొండచిలువను బయటకు లాగాడు.. ఆ కొండ చిలువ పరిమాణం చూస్తే పక్కాగా షాకవడం ఖాయం. అతను దాన్ని పట్టుకున్నంత సేపు అది అతని కడుపు భాగాన్ని, ఆ తరువాత మెడను చుట్టేసి అతన్ని చంపేయాలని ప్రయత్నించడం ఆ వీడియో చూడవచ్చు..
Also Read
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
- Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
ఆ కొండచిలువ పదే పదే ప్రయత్నం చేస్తున్నా అతను తన నముడుకు, మెడకు చుట్టుకున్న కొండచిలువను సున్నితంగా చేతులతో విడిపించుకుంటాడు. చివరికి దాన్ని ఒక సంచిలో వేసేవరకు ఆ వీడియోను తీసినట్లు ఉంది.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో వీడియో వైరల్ అయ్యింది.. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొండ చిలువ పట్టిన వ్యక్తిని జాగ్రత్తగా ఉండమని కొందరు సలహా ఇస్తుండగా, మరికొందరు అతని ధైర్యానికి అవాక్కవుతున్నారు. ‘ఇంత భారీ కొండచిలువను పట్టుకోవడం నేను మొదటిసారి చూస్తున్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు… ఇక కొందరేమో అన్నో ఏందన్నా నీ ధైర్యం అని కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
-
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!