Site icon NTV Telugu

Karnataka Teacher : కర్ణాటక సీఎంను విమర్శించిన టీచర్ సస్పెండ్

Teacher Cm Siddaramaiah

Teacher Cm Siddaramaiah

Karnataka Teacher : ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ టీచర్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. పోస్ట్ షేర్ చేసిన కొద్ది నిమిషాలకే కర్ణాటక స్కూల్ టీచర్ సస్పెండ్ అయ్యారు. కర్ణాటకలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం సిద్ధరామయ్యను విమర్శిస్తూ శాంతమూర్తి అనే టీచర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈయన చిత్రదుర్గ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈయన ఆదివారం సస్పెండ్ చేశారు.

Read Also:Vijayawada: హెడ్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. ఇంట్లోనే మసాజ్ సెంటర్

చిత్రదుర్గంలోని హొసదుర్గంలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శాంతమూర్తి ఎంజీ అనే ఉపాధ్యాయుడు రాష్ట్ర ప్రభుత్వంపైనా, ఉచితాలపైనా విమర్శలు గుప్పించారు. ‘ఫ్రీబీస్ ఇవ్వడం తప్ప ఇంకేం చేయగలం’ అని శాంతమూర్తి ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేకాదు అతను తన పోస్ట్‌లో, వివిధ ముఖ్యమంత్రుల హయాంలో ఎంతెంత అప్పు చేశారో వివరంగా రాసుకొచ్చాడు. ‘‘మాజీ సీఎంల హయాంలో.. ఎస్‌ఎం కృష్ణ రూ.3,590 కోట్లు, ధరమ్‌సింగ్‌ రూ.15,635 కోట్లు, హెచ్‌డీ కుమారస్వామి రూ.3,545 కోట్లు, బీఎస్‌ యడ్యూరప్ప రూ.25,653 కోట్లు, డీవీ సదానందగౌడ రూ.9,464 కోట్లు, జగదీశ్‌ షెట్టర్‌ రూ.2 కోట్లు, సిద్ధరామయ్య రూ.41 కోట్లు.. 42,000 కోట్లు” అని శాంతమూర్తి పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Read Also:CPI Narayana: మోడీ అసలైన ఆర్ధిక నేరస్తుడు : సీపీఐ నారాయణ

ఇది కొత్తగా ఏర్పడే ప్రభుత్వాన్ని విమర్శించడమేనని.. భావించిన క్షేత్ర విద్యాశాఖాధికారి ఎల్‌.జయప్ప శనివారం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. “శనివారం కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో గత ప్రభుత్వాల హయాంలో చేసిన అప్పులను ప్రస్తావించడం ద్వారా ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారు. అందుకే ఆయనను సస్పెండ్ చేశాం” అని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో తెలిపారు.

Exit mobile version