NTV Telugu Site icon

Heavy rain: బెంగళూరులో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

Raeie

Raeie

భారీ వర్షంతో టెక్ సిటీ బెంగళూరు తడిసిముద్దైంది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దీంతో బెంగళూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నీటి కొరత.. ఇంకోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో బెంగళూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Thota Narasimham: తండ్రికి మద్ధతుగా తనయుడు ప్రచారం..

గత కొద్ది రోజులుగా నీటి కొరతతో బెంగళూరు వాసులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. ప్రతి రోజూ తాగునీటి కష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఇలాంటి సమయంలో సోమవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో బెంగళూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకోవైపు ఎండ వేడిమి నుంచి కూడా ఉపశమనం పొందుతున్నారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పడడంతో వీధుల్లోకి వచ్చి విహరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: China: చైనాలో మళ్లీ మహమ్మారి వ్యాప్తి చెందుతుందా..? ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని సిఫార్సు

ఈ ఏడాది ఎన్నడూలేనంతంగా తాగునీటి సమస్యతో బెంగళూరు సిటీ అల్లాడిపోయింది. కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. బోరు బావులు ఎండిపోవడం.. బయట నీళ్లు లభించక అష్టకష్టాలు పడ్డారు. స్నానాలు చేసేందుకు కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో భారీ వర్షం నగరానికి మంచి ఉపశమనాన్ని కలిగించింది.

ఇది కూడా చదవండి: David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్ వల్ల చాలా బాధను అనుభవించాను.. డేవిడ్ వార్నర్..

ఇదిలా ఉంటే దక్షిణ భారత్‌కు కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ద్రోణి కారణంగా మూడు, నాలుగు రోజులు సౌతిండియాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురవచ్చాయని చెప్పింది. అలాగే వేడి గాలుల ప్రభావం తగ్గుతుందని చెప్పింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఉల్లాసంగా గడుపుతున్నారు.

 

Show comments