Site icon NTV Telugu

Karnataka: కర్ణాటక పవర్ పాలిటిక్స్‌లో పరేషాన్.. మూడు ముక్కలుగా చీలిన ఎమ్మెల్యేలు.. మూడో టీం ఎవరిదో తెలుసా..?

Karnataka

Karnataka

Karnataka Congress in Turmoil: కర్ణాటక పవర్ పాలిటిక్స్‌లో పరేషాన్ నెలకొంది. కర్ణాటక ఎమ్మెల్యేలు మూడు ముక్కలుగా చీలారు. ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ వర్గాల తలపోటుగా మారిన విషయం తెలిసిందే. హైకమాండ్ వైపే మేమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీం తెరపైకి వచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. 2023లో సిద్ధరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొదట్లో అనుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు డీకే శివకుమార్‌కు అప్పగించాలని కొంత మంది ఎమ్మెల్యేలు డిమాండ్ లేవనెత్తుతున్నారు. తనను ముఖ్యమంత్రి చేయాలంటూ డీకే శివకుమార్ ఇప్పటికే పలుసార్లు హై కమాండ్‌తో చర్చలు జరిపారు.

READ MORE: YV Subba Reddy: సిట్ అడిగిన ప్రశ్నలకు అన్నీ నిజాలే చెప్పా.. వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ నేపథ్యంలో డీకే తరఫు ఎమ్మెల్యేలు నిన్న రాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. నిన్న(గురువారం) ఎమ్మెల్యేలు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఇవాళ కేసి వేణుగోపాలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. డీకే శివకుమార్ ఎమ్మెల్యే కావాలని హై కమాండ్‌పై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పగ్గాలను డీకే శివకుమార్ కు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. మరోవైపు.. సిద్ధరామయ్య సీఎం పీఠం వదులుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. తాను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగలేనని డీకే శివకుమార్ చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య అసలేం జరుగుతుంది..? హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

READ MORE: Piracy: షాకింగ్.. SBI ఇన్సూరెన్స్ పోర్టల్‌లో పైరసీ సినిమాలు ప్రత్యక్షం..?

Exit mobile version