DK Shiva kumar: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస ప్రమాదాలకు గురవుతున్నాడు. నిన్న కాక మొన్న హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా దానిని పక్షి ఢీకొట్టింది. ఆ సమయంలో ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ ను ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మళ్లీ నేడు(గురువారం) హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన కొద్దిదూరంలో మంటలు చెలరేగాయి. దీనితో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. మంటలు ఆరిపోవడంతో డీకే శివకుమార్ కు పెను ప్రమాదం తప్పింది. హొన్నవరంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా గత మూడు రోజుల్లో శివకుమార్ ప్రమాదం బారిన పడడం రెండోసారి.
Read Also:Tamilnadu : తనకోసం తెచ్చుకున్న మందు తాగిందని భార్యను చంపిన భర్త
కాగా.. మే 2న ఉదయం శివకుమార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో ముళబాగిలుకు బయలుదేరారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో జక్కూరు నుంచి డీకే శివకుమార్ హెలికాప్టర్ బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి 40 కి.మీ. దూరంలోని హోసకోటే సమీపంలో డేగ ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్‌ను హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పినట్లు డీకే శివకుమార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ముందు భాగం దెబ్బతింది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు.. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు రానున్నాయి. ఈసారి 2,613 అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
Read Also:Terrible Video : పౌరుషం అంటే ఇదీ.. బతికినా చచ్చినా ఇలాగే ఉండాలి..