NTV Telugu Site icon

Karnataka: 1500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో దిక్కుతోచని స్థితిలో రైతులు

Karnataka Land Issue (1)

Karnataka Land Issue (1)

Karnataka Land Issue: కర్ణాటకలోని విజయపుర జిల్లా హోన్వాడ గ్రామంలో 1,500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ పూర్వీకుల భూమిని వక్ఫ్‌ ఆస్తిగా పేర్కొంటూ తహసీల్దార్‌ నుంచి రైతులకు నోటీసులు అందడంతో విషయం వేడెక్కింది. దింతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వరుస ఆరోపణలతో పాటు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఇక్కడ బీజేపీ రైతుల హక్కులపై దాడి అని పేర్కొనగా, భూమిని లాక్కోదని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Read Also: ISRO Chief Somnath : 2026లో గగన్‌యాన్, 2028లో చంద్రయాన్-4 : ఇస్రో చీఫ్ సోమనాథ్

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఎలాంటి స్పష్టమైన కారణం, ఆధారాలు లేకుండానే రైతుల భూములను వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. ఈ భూమిని 15 రోజుల్లోగా వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్టర్ చేయాలని రాష్ట్ర వక్ఫ్ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారని సూర్య ఆరోపించారు. వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ కూడా చెప్పారు.

Read Also: Delhi : యమునా నదిలో స్నానం చేసి ఆస్పత్రి పాలైన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు

ఇక మరోవైపు, ఈ అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆరోపిస్తూ.. ఆ భూమి వక్ఫ్ ఆస్తి అయితేనే నోటీసులిచ్చామని అన్నారు. రైతుల వద్ద అన్ని పత్రాలు ఉంటే న్యాయపరంగా పోరాడవచ్చని చెప్పారు. ఈ విషయంపై కేబినెట్ మంత్రి ఎంబీ పాటిల్ కూడా రైతులతో సమావేశమై సరైన భూమి పత్రాలు కలిగి ఉంటే వారి భూమి పోతుందని వారికి హామీ ఇచ్చారు. ఈ అంశం విజయపుర రైతులకు ఆందోళన కలిగిస్తోంది. రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య.. తమ పూర్వీకుల భూమిని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రైతులు చెబుతున్నారు.

Show comments