Site icon NTV Telugu

Karnataka Crime News: బెంగళూరులో ఓ వ్యక్తిపై 70సార్లు కత్తిపోట్లు.. మృతి

Bengaluru Crime

Bengaluru Crime

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత ఎంకే అళగిరి సహాయకుడిపై బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన మృతి చెందారు. ఈ దాడి ఘటన సెప్టెంబర్ 5న జరిగింది. దాడి చేసిన అనంతరం బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. మృతి చెందాడు. మృతుడు వీకే గురుస్వామి మూర్తిగా(64) గుర్తించారు. అతను తమిళనాడులోని మధురైకి చెందిన గ్యాంగ్‌స్టర్ గా చెబుతున్నారు. ఓ ప్రాపర్టీ విషయంలో బ్రోకర్‌ను కలిసేందుకు బెంగళూరుకు వచ్చిన అతడు ఓ రెస్టారెంట్‌లో కూర్చుని మాట్లాడుతుండగా దుండగులు హత్యకు పాల్పడ్డారు.

Read Also: Disha Patani : పొట్టి డ్రెస్సులో క్లివేజ్ షో చేస్తున్న దిశా..

4 నుండి 5 మంది దుండగులు కత్తులు పట్టుకుని వచ్చి అతనిపై తీవ్రంగా దాడి చేశారు. దాడి చేస్తున్న క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో అతన్ని హోటల్ లో వేటాడి మరి దాడి చేశారు దుండగులు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. గురుస్వామిపై 70 సార్లు కత్తితో దాడికి పాల్పడ్డారని తెలిపారు. దాడి చేసిన వారిని గుర్తించామని.. పాండియన్ గ్యాంగ్ దాడి చేసిందని చెప్పారు. దీంతో పోలీసులు పలువురి నిందితులను అరెస్ట్‌ చేశారు.

Read Also: Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారం అందించిన అమెరికా..

తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుస్వామి హిస్టరీ షీటర్. అతడిపై 8 హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈస్ట్ డీసీపీ భీమా శంకర్ గులేద్ మాట్లాడుతూ గురుస్వామి హత్య, హత్యాయత్నం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నాడని, కిరుతై పోలీస్ స్టేషన్‌లో హిస్టరీ షీటర్‌గా ఉన్నాడని తెలిపారు. అతడికి మరో ముఠాతో 30 ఏళ్లుగా శత్రుత్వం ఉందని పేర్కొన్నారు.

Exit mobile version