Site icon NTV Telugu

Karnataka: కర్ణాటకలో వేడెక్కుతున్న రాజకీయలు.. ఖర్గేతో సీఎం సిద్ధరామయ్య భేటీ..

Cm Siddaramaiah

Cm Siddaramaiah

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు చుట్టూ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మరోసారి ఊపందుకుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించామని, ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా తాను అంగీకరిస్తానని ప్రకటించారు.

READ MORE: Akhanda 2 : భారీ అంచనాల నడుమ ‘అఖండ 2’ ప్రీమియర్స్ ప్లాన్..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది. కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాజధానిలో వివరంగా చర్చించనున్నారు. నవంబర్ చివరి నాటికి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని, త్వరలో నిర్ణయం తీసుకోవడం అవసరమని నిఘా నివేదికలు పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించినట్లు కర్ణాటక సీఎంఓ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి సిద్ధరామయ్య ఖర్గేతో సమావేశమై పాలనపై రాజకీయ సంక్షోభం ప్రభావం గురించి వివరంగా చర్చించారు. సిద్ధరామయ్య పార్టీ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు పిలిచినా ఢిల్లీకి వెళ్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

READ MORE: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్

ఖర్గేతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య.. “పార్టీ నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా/తాలూకా పంచాయతీ ఎన్నికలపై చర్చించాం. మంత్రివర్గంపై ఎలాంటి చర్చ జరగలేదు. నాయకత్వ మార్పులు కేవలం ఊహాగానాలు, మీడియా కల్పించినవే” అని అన్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం గురించి ఖర్గేతో మాట్లాడినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లొచ్చు.. కానీ చివరికి, హైకమాండ్ ఏమి చెప్పినా.. మనమందరం పాటించాల్సిందే అన్నారు. తాను అయినా, డీకే శివకుమార్ అయినా.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు.

Exit mobile version