NTV Telugu Site icon

Karnataka: ఆర్‌ఎస్‌ఎస్‌కు షాకిచ్చిన కర్ణాటక సీఎం

Karnataka Cm

Karnataka Cm

రాష్ట్రీయ స్వయం సేవక్‌ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య షాక్‌ ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధమైన జనసేవా ట్రస్టుకు అప్పటి బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంది. అయితే, వాస్తవానికి భూమి ఇస్తామని అప్పట్లో బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి, కొంత ప్రాసెస్ చేసింది. అయితే తాజాగా భూమి ఇవ్వడం కుదరదని సిద్ధరామయ్య సర్కార్ తేల్చి చెప్పింది.

Read Also: Kottu Satyanarayana: సీఎం జగన్‌ని విమర్శిస్తే.. ప్రజలే పవన్‌కి మరోసారి బుద్ధి చెప్తారు

ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధమైన జనసేవా ట్రస్టుకు బెంగళూరు దక్షిణ తాలూకా కురుబరహళ్ళి పంచాయతీ తావరెకెరె పరిధిలో 35.33 ఎకరాల గోమాళ భూమిని బస్వారాజ్ బొమ్మై ప్రభుత్వం గతంలో కేటాయించింది. 2023 మే 22న జిల్లాధికారి గోమాళ భూమిని జనసేవా ట్రస్టుకు అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేశారు. ఇకపోతే, ప్రస్తుతం భూమిని అప్పగించేందుకు తగిన పర్మిషన్ లను జారీ చేయాల్సి ఉంది. కానీ, ప్రభుత్వ సూచనల మేరకు సదరు భూమిని జనసేవా ట్రస్టుకు ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది.

Read Also: Rangasthalam: జపాన్‌లో రామ్ చరణ్‌ ‘రంగస్థలం’కి దిమ్మతిరిగే కలెక్షన్లు.. మొదటి రోజే రికార్డులు తిరగరాస్తూ!

ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీ ప్రభుత్వం కేటాయించిన అన్ని భూముల విధానాలను క్యాన్సిల్ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు పలుసార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్ కు తొలి షాక్‌ ఇచ్చేలా 35.33 ఎకరాల భూమిని అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పాటు బొమ్మై ప్రభుత్వంలోని హామీలన్నీ తిగరతోడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి బయటకు తీసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇది జరిగితే కర్ణాటకలో కాషాయం నేతలను కటకటల్లోకి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది.