NTV Telugu Site icon

Karnataka Election Schedule: కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..

Karnataka

Karnataka

Karnataka Election Schedule: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే విడతలో కర్ణాటక ఎన్నికలను జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కర్ణాటకలో తొలిసారి ఓట్‌ ఫ్రమ్‌ హోమ్ అవకాశాన్ని ఈసీ కల్పించింది. 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. మే 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. మే 13న ఎన్నికల ఫలితం వెలువడుతుందని ప్రకటించింది. మే 24తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. కర్ణాటకలో 224 స్థానాలకు గానూ 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్‌ స్థానాలుగా నిర్ణయించినట్టు సీఈసీ తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

నోటిఫికేషన్ విడుదల తేదీ- 13 ఏప్రిల్, 2023

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- 20 ఏప్రిల్,2023

నామినేషన్ల పరిశీలన- 21 ఏప్రిల్, 2023

నామినేషన్ల ఉపసంహరణ- 24 ఏప్రిల్, 2023

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్- మే 10, 2023

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- మే 13, 2023

కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గాలు – 224

కర్ణాటక ఓటర్ల సంఖ్య – 5, 21,73, 579 మంది.

పోలింగ్ కేంద్రాల సంఖ్య – 58,282

మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలు – 1,320

Read Also: Gannavaram Airport: ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్‌ ప్రయాణికులు..!

కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలుండగా.. మ్యాజిక్‌ ఫిగర్‌ 113 స్థానాలు. ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 స్థానాలున్నాయి. కర్ణాటకలో 36 ఎస్సీ, 15 ఎస్టీ రిజర్వేషన్‌ స్థానాలు ఉన్నాయి. కర్ణాటకలో మొత్తం 5కోట్ల 21లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 150 స్థానాల్లో లక్ష్యంగా గెలుపును టార్గెట్‌గా పెట్టుకుంది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో లింగాయత్‌ వర్గాలకు 4శాతం రిజర్వేషన్లను బీజేపీ కల్పించింది. 93 స్థానాలకు అభ్యర్థులను జేడీఎస్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ మొదటి వారంలో బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించనుంది.

కర్ణాటక రాష్ట్రంలో సొంతంగా అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్.. తొలి జాబితాను ప్రకటించింది. ఈ నెల 25న 124 మందికి టికెట్ కేటాయిస్తూ తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేస్తుండగా, వరుణ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కోలార్ నుంచి ఆయన కుమారుడు, కొరటగెరె నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, దేవనహళ్లి నుంచి మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప, చితాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పోటీ చేయనున్నారు. కాగా, 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయింది. ఇక మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‍గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.