Site icon NTV Telugu

Karnataka: భార్య వేరే వ్యక్తితో సంబంధం.. అతని గొంతు కోసి రక్తం తాగిన భర్త

Karnataka

Karnataka

అక్రమ సంబందాలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. శారీరక సుఖం కోసం ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు.. కొన్ని సంబంధాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి.. మరికొన్ని బంధాల వల్ల ప్రాణాలే పోతున్నాయి.. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది.. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త కోపంతో రగిలిపోయాడు.. ఇక భార్యను వదులుకోలేక సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అతి కిరాతకంగా చంపి అతని మీద పడి రక్తం తాగాడు.. వింటుంటే ఒళ్లు గగుర్పొడిచేస్తున్న ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది..

వివరాల్లోకి వెళితే.. కర్నాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్‌లో దారుణం వెలుగు చూసింది. భార్య ప్రియుడిని అత్యంత దారుణంగా గొంతు కోసి, ఆపై అతని రక్తాన్ని తాగాడు భర్త..ఈ ఘటన జిల్లాలోని చింతామణి తాలూకా సిద్దేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బట్లహళ్లి నివాసి విజయ్‌, మాల దంపతులు. అయితే, చేలూర్ తాలూకాలోని మోడెంపల్లికి చెందిన మారేష్‌కు మాల కు మధ్య అక్రమ సంబంధం ఉందని చాలాసార్లు ఇద్దరు కలుసుకున్నప్పుడు స్థానికులు చూసినట్లు చెప్పారు.. ఇక ఊర్లో ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తుంది.. అది విని సహించలేక పోయిన అతను కోపంతో రగిలిపోయాడు..

ఇక అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు..మాట్లాడుకుందాం దా అంటూ మారేష్‌ను సిద్దేపల్లి క్రాస్ సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ మారేష్‌పై విజయ్ దాడి చేశాడు. గొంతు కోసం రక్తం తాగాడు. ఈ దృశ్యాన్ని మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, తీవ్రంగా గాయపడిన మారేష్‌ను కొందరు స్థానికులు గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు..ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.. అతని భార్యను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరిపిస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version