Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకున్నారు. ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కొంత బంగారం రికవరీ చేశారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొరికిన దొంగలను అరెస్టు చేసి నేడు మీడియా సమావేశంలో సీపీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. దీ గోల్డెన్ థీఫ్ పేరుతో ఆపరేషన్ సాగినట్లు తెలిపారు. సుబోధ్ సింగ్ ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాల్లో ముఠా నడుస్తోందన్నారు. బంగారు నగల దుకాణాలు, బ్యాంకులను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు. కరీంనగర్ దోపిడీలో రఘునాథ్ కర్మకార్ అలియాస్ జాగిరా సింగ్, రవిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమ్న్, రాధే అలియాస్ అభయ్ అలియాస్ ప్రమోద్ గోస్వామి, మిశ్రా, సూర్యమని కుమార్ అలియాస్ సనోజ్లు పాల్గొన్నట్టు సీపీ వివరించారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.
“ఈ దుండగులు కరీంనగర్ దోపిడీ చేసి బైక్‌లపై పారిపోయారు.. మొత్తం గ్రామీణ రూట్ ఎంచుకున్నారు. బైకులు వదిలేసి బస్సులు, రైళ్లలో పారిపోయారు. వీళ్ళలో నలుగురు కాల్పులు జరిపారు. ఈ గ్యాంగ్ కి రఘునాథ్ కర్మకార్ లీడ్ చేశాడు. మొత్తం ప్లాన్ జైల్లో ఉన్న సుభోద్ సింగ్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ గ్యాంగ్ ఒక ఎంటర్ ప్రైజ్ లెవల్లో నడుపుతున్నారు. ఇందులో ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు. మరో ఇద్దరు అసన్ సాల్ నుంచి వచ్చారు. దాదాపు నలభై ఐదు రోజులు రాష్ట్రంలో తిరిగారు. వివిధ పట్టణాల్లో తిరిగి.. చివరికి కరీంనగర్ ఎంచుకున్నారు. పక్కా ప్లాన్ తో దోపిడీ చేశారు. గూగుల్ మ్యాప్ లో ఆఫ్ లైన్ తీసుకున్నారు. ఈ గ్యాంగ్ పై పెద్దమొత్తంలో కేసులు ఉన్నాయి. సుబోధ్ సింగ్ ముఠా ఇప్పటి వరకు 400 కిలోల బంగారం దోపిడీ చేసినట్టు సమాచారం. ఇక్కడ షెల్టర్ తీసుకుంటే గుర్తుపడతారు అని ధర్మపురిలో బస చేశారు. రెక్కీ చేసినప్పుడు వీరి వద్ద ఆయుధాలు లేవు. వీరికి ఆయుధాలు దోపిడీకి ముందురోజు 6 పిస్టల్స్, 12 మాగ్జిన్స్ చంద్రపూర్‌లో వేరే ముఠా ఇచ్చింది. రెండు బైక్‌లు వాడారు. ఒక బైక్ వదిలేశారు. మరో ఇద్దరు సొత్తు తీసుకుని బైక్‌పై వెళ్లారు. గోదావరి దాటిన వాళ్ళు బస్సుల్లో వెళ్లారు. దొంగిలించిన సొత్తు తీసుకువెళ్లిన వారు అడవి బాటలో వెళ్లి ఇంకో ముఠాకి సొత్తుని అప్పగించారు. అక్కడ నుంచి వారు కూడా విడిపోయారు. ఈ ఘటనపై ఇంకా విచారణ సాగుతుంది. గ్యాంగ్ లీడర్ సుభోద్ సింగ్ పూర్ణియా జిల్లాలో ఉన్నాడు. పీటీ వారెంట్‌పై పట్టుకుని వస్తాం. ఈ దోపిడీలో పాల్గొన్న వారిపై గతంలో దోపిడీ కేసులున్నాయి. మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. నకిలీ ఆధార్ కార్డులు ఇచ్చారు. అవే పేర్లను కూడా వాడారు. ఈ గ్యాంగ్ లో ఉన్న సభ్యులకు ఒకరి పేరు మరొకరికి తెలియదు. ఊరు పేర్లు కూడా తెలియవు. వీరి సంప్రదింపులు అన్ని ఒక యాప్ ద్వారా జరుగుతుంది. వారి ఫీడ్ బ్యాక్, వారి డ్యూటీస్ అన్ని యాప్ లో షేర్ అవుతూ ఉంటాయి. దోపిడీకి టీమ్స్ వారీగా పని విభజన ఉంటుంది. ఏ టీమ్ కి మరో టీమ్ మెబర్స్ తెలియదు. పోలీస్ టీమ్స్ హార్డ్ వర్క్ చేశాయి.” అని సీపీ వెల్లడించారు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!