మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
- దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కార్బన్ మళ్లీ భారత మార్కెట్లోకి రీఎంట్రీ
- రెబెల్ సిరీస్‌లో కార్బన్ రెబెల్ ప్రో, కార్బన్ రెబెల్ పేర్లతో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల
- ఫోన్లకు సంబంధించిన మైక్రోసైట్లు ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karbonn Rebel Series: దేశీయ టెక్ బ్రాండ్ కార్బన్ (Karbonn) మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. త్వరలోనే తన కొత్త రెబెల్ (Rebel) సిరీస్‌లో రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. కార్బన్ రెబెల్ ప్రో (Karbonn Rebel Pro), కార్బన్ రెబెల్ (Karbonn Rebel) పేర్లతో ఈ ఫోన్లను తీసుకురానుంది. ఇప్పటికే ఈ రెండు ఫోన్లకు సంబంధించిన మైక్రోసైట్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో డిజైన్, కీలక ఫీచర్లు, బ్యాటరీ, డిస్ప్లే వివరాలను కంపెనీ వెల్లడించింది.
కార్బన్ రెబెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లు అమెజాన్ ద్వారా అమ్మకాలకు రానున్నాయి. రెబెల్ ప్రో మోడల్ బ్లూ, బర్గండీ, గోల్డ్, గ్రే రంగుల్లో అందుబాటులో ఉండనుంది. సాధారణ రెబెల్ మోడల్ బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో లభించనుంది. అయితే ఈ ఫోన్ల ఖచ్చితమైన లాంచ్ తేదీ, ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కార్బన్ రెబెల్ ప్రో ఫోన్ ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌తో రానుంది. వెనుక భాగంలో ఎడమవైపు పైభాగంలో నిలువుగా ఉండే దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను అందించారు. కుడివైపు పవర్, వాల్యూమ్ బటన్లు ఉండనున్నాయి. దిగువ భాగంలో కార్బన్ బ్రాండింగ్‌తో పాటు యూఎస్బీ టైప్-సీ పోర్టును ఏర్పాటు చేశారు. ఇక సాధారణ రెబెల్ మోడల్ కూడా ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌తోనే రానుంది. అయితే ఇందులో వెనుక కెమెరాల కోసం అడ్డంగా ఉండే దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌ను అందించారు. ఇందులో మూడు కెమెరా కటౌట్లు త్రిభుజాకార అమరికలో ఉండగా, పక్కనే ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
Also Read
- 9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
- Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
- UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
- SOS బటన్, Family Assist ఫీచర్లtho 'సీనియర్ సిటిజన్ల' కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
బ్యాటరీ విషయంలో రెండు మోడళ్లలోనూ భారీ సామర్థ్యాన్ని అందిస్తున్నారు. కార్బన్ రెబెల్ ప్రోలో 6,000mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 20W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లోనే 20W ఛార్జింగ్ అడాప్టర్, యూఎస్బీ టైప్-C కేబుల్‌ను అందించనున్నారు. మరోవైపు సాధారణ రెబెల్ మోడల్లో 7,000mAh బ్యాటరీతో పాటు 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. రెబెల్ ప్రోలో 6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను అందించనున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్ఠంగా 720 నిట్స్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. సాధారణ రెబెల్ మోడల్లో 6.75 అంగుళాల హెచ్డీ+ టచ్‌స్క్రీన్ ఉండనుంది. దీని గరిష్ఠ బ్రైట్నెస్ 650 నిట్స్‌గా ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనున్నాయి. ఎలాంటి అనవసరమైన ముందస్తు యాప్స్ (బ్లోట్‌వేర్) లేకుండా సాఫ్ట్వేర్ అనుభవాన్ని అందిస్తామని కార్బన్ ప్రకటించింది. అంతేకాకుండా రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, రెండు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్లను అందించనున్నట్లు వెల్లడించింది. అయితే ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, లాంచ్ తేదీ వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?