Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై కాపు జేఏసీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..

Pawan

Pawan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. విజయవాడలో కాపు ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.. ఐక్యత, సమైక్యత, అభివృద్ధి, రాజ్యాధికారం మన కోసం అజెండాతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ.. కాపుల జోలికి వస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని గుర్తించాలి అంటూ హెచ్చరించారు.. మనకు వచ్చిన సదుపాయాలు తీసేస్తే స్పందించాలి.. కానీ, తెచ్చిన ఫలితాలు నిలబెట్టుకో లేకపోతున్నాం అన్నారు.. వంగవీటి రంగా మీద దాడితో ప్రభుత్వం కూలిపోయింది అని గుర్తుచేసిన ఆయన.. మనలో పుట్టిన నాయకులను బలపరచకపోతే భవిష్యత్తులో ముందుకు వెళ్లలేం అన్నారు..

Read Also:Bandlaguda Jagir Municipal: బండ్లగూడలో16 మంది కార్పొరేటర్ల ఆందోళన.. కారణం ఇదీ..!

చేతనైతే మన నాయకుడిని బలపరుద్దాం.. ఇబ్బందుగా ఉంటే మౌనంగా ఉందాం.. కానీ, నాయకత్వాన్ని పాడుచేయద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇక, వచ్చే ఎన్నికల్లో కాపుల డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలకు సపోర్టు చేద్దాం అని పిలుపునిచ్చారు.. కాపు రిజర్వేషన్ పై స్ధిరమైన నిర్ణయం ఉన్న పార్టీతో కలిసి వెళ్దాం అన్నారు.. రాజ్యాధికారం, రిజర్వేషన్ మేనిఫెస్టో లో పెట్టే పార్టీకి మద్దతు కొనసాగించండి అని కాపు సోదరులకు సూచించారు కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కాపుల నుంచి పవన్‌ కల్యాణ్‌కు మరింత సపోర్ట్‌ దొరికినట్టు అయ్యింది.. ఇప్పటికే మాజీ మంత్రి హరి రామ జోగయ్య.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.. వివిధ అంశాలపై ఆయన వరుసగా లేఖలు రాస్తోన్న విషయం విదితమే.

Exit mobile version