Site icon NTV Telugu

Kapil Sharma : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కపిల్‌ శర్మ

Kapil Sharma Green India

Kapil Sharma Green India

ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్, ‘ది కపిల్ శర్మ షో’ హోస్ట్ కపిల్ శర్మ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని, ముంబైలోని గోరేగావ్‌లోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రంగారి ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, బీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి ఒక మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆకట్టుకునే కార్యక్రమంగా అభివర్ణించిన కపిల్‌ శర్మ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన చొరవ తనను కదిలించిందని అన్నారు. “మనం మన కోసం కాదు, ఇతరుల కోసం కూడా ఉన్నామని ఇది నాకు అనిపిస్తోంది,” అని కపిల్ శర్మ అన్నారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది మన భవిష్యత్ తరాలు ఈ భూమిపై మెరుగైన జీవితాన్ని గడపడానికి ఉద్దేశించిన ఒక అద్భుతమైన కార్యక్రమం.

Also Read : Cost Of Living Crisis In UK: యూకేలో జీవన వ్యయ సంక్షోభం..పెరుగుతున్న దొంగతనాలు..

మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనందరి బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలి.” అని కపిల్‌ శర్మ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. “నా షో చూసే వారందరికీ ఒక మొక్క నాటాలని నా అభ్యర్థన. హరిత భారతదేశాన్ని రూపొందించే దిశగా సంతోష్ కుమార్ చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలని నా అభిమానులందరినీ అభ్యర్థిస్తున్నాను. సంతోష్ కుమార్ గారు ఇటువంటి అద్భుతమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ తెలియజేసారు కపిల్‌ శర్మ. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని, రాబోయే వర్షాకాలంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని పెద్ద విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

Also Read : Rajanna Dora: ‘సెటిలర్స్’ వ్యాఖ్యలపై వివాదం.. డిప్యూటీ సీఎం వివరణ

Exit mobile version