NTV Telugu Site icon

Rishabh Pant: ‘పంత్.. నిన్ను కొట్టేస్తా’: మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్

Sff

Sff

టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్‌ ఇటీవల కారు ప్రమాదానికి గురై ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇతడు దాదాపు ఆరు నెలలు క్రికెట్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే అందరూ పంత్ లేని లోటు గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గత బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో అతడు టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. ఇదే విషయమై టీమిండియా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ మాట్లాడుతూ.. పంత్ గాయం కారణంగా టీమిండియా కాంబినేషన్ దెబ్బతిందని.. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురైనందుకు కొట్టేస్తాను అంటూ మండిపడ్డాడు.

Also Read: INDvsAUS 1st Test: రవిశాస్త్రి ఫైనల్ ఎలెవన్ ఇదే..ఓపెనర్లుగా వీరే!

“పంత్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతడు త్వరగా కోలుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కానీ అతడి వద్దకు వెళ్ల చెంపదెబ్బ కొట్టాలనుకుంటున్నా. పంత్ తనపై శ్రద్ధ పెట్టి ఉన్నట్లయితే ప్రమాదానికి గురయ్యే వాడు కాదు. అతడి గాయం టీమ్ మొత్తం కాంబినేషన్‌ను దెబ్బతీసింది. అందుకే అతడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో కోపం కూడా ఉంటుంది. నేటి యువతలో చాలా మంది అబ్బాయిలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అతడికి ఓ చెంపదెబ్బ కూడా కొట్టాలి” అని కపిల్ వెల్లడించాడు.

Also Read: INDvsAUS Test: తుది జట్టు కూర్పుపై కెప్టెన్ రోహిత్ ఏమన్నాడంటే!

ఏదిఏమైనప్పటికీ కపిల్ దేవ్ ఓ పాజిటివ్ నోట్‌లోనే పంత్‌పై కామెంట్స్ చేశాడు. అతడి మీద ప్రేమతో, జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతుంది. పంత్ విషయంలో ఓ మంచి పాయింట్ కూడా కపిల్ లేవనెత్తారు. అతడు లేకపోవడంతో మిడిలార్డర్‌ టీమ్ సెలెక్షన్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం వికెట్ కీపింగ్ కారణమే కాకుండా బ్యాటింగ్ కూడా ఆ స్థానంలో కీలకం. పంత్ లాంటి దూకుడైన బ్యాటర్ లేకపోవడం ఇప్పుడు ఇబ్బందిగా మారింది.

Also Read: Uttar Pradesh: మామూలు భార్యలు కాదు.. బ్యాంకులో 50 వేలు పడగానే ప్రియులతో లేచిపోయారు..