Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలనే నిర్ణయంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ, కోహ్లీ ఈ విషయంలో కాస్త తొందరపడ్డాడని అభిప్రాయపడ్డారు. కోహ్లీ మరికొన్ని సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడి ఉండాల్సిందని, అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. మైదానంలో కోహ్లీ ప్రదర్శించే దూకుడును టెన్నిస్ దిగ్గజం జాన్ మెకెన్రోతో ఆయన పోల్చారు.
గత ఏడాది (మే నెలలో) కోహ్లీ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 770 పరుగుల దూరంలో ఉన్న సమయంలో, 37 ఏళ్ల వయసులో కూడా అత్యుత్తమ ఫామ్‌లో ఉంటూ విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడంపై తీవ్ర చర్చ నడిచింది.
Also Read
ఈ విషయంపై కపిల్ దేవ్ మాట్లాడుతూ… ఇది కేవలం 10 వేల పరుగుల గురించిన విషయం కాదని, కోహ్లీ కోపంలో లేదా ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోకుండా, మరో ఆరు నెలలు ఓపిక పట్టి ఉంటే బాగుండేదని అన్నారు. భారత్ తరఫున ఆడటం ఆపేసాక మళ్లీ అవకాశం రాదని, ఆ తర్వాత కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే మిగులుతుందని గుర్తుచేశారు.
సెలక్టర్లు లేదా కెప్టెన్ మిమ్మల్ని ఎంపిక చేయనప్పటికీ, ఆవేశపడకుండా మరికొంత సమయం ఇవ్వాలని కపిల్ దేవ్ సూచించారు. గతంలో మోహిందర్ అమర్నాథ్, అంశుమన్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు జట్టులో చోటు కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్‌కు వెళ్లి పరుగులు సాధించి మళ్లీ పునరాగమనం చేశారని ఉదాహరణగా చెప్పారు. ఐపీఎల్ లేదా ఇతర టోర్నమెంట్లలో కోహ్లీ ఆడుతున్న తీరును చూస్తే, అతనికి ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యం పూర్తిగా ఉందని, కానీ సమయం కంటే ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం తనకు కొంత నిరాశ కలిగించిందని కపిల్ దేవ్ వివరించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!