Site icon NTV Telugu

KantaraChapter1 : కాంతార చాఫ్టర్ 1 సూపర్ హిట్.. రివ్యూ ఇచ్చేసిన యంగ్ టైగర్

Jr Ntr

Jr Ntr

కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్‌ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ 1 ను తీసుకువచ్చారు. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఆయింది.

Also Read : Bollywood : ఇంటెన్సివ్ లవ్ స్టోరీలకు పట్టం కడుతున్న బాలీవుడ్

కాగా ఈ సినిమా ప్రీమియర్స్ నుండి మంచి టాక్ వచ్చింది.దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టి మెప్పించాడని ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంతార సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ‘అద్భుతమైన విజయాన్ని సాధించిన  కాంతార చాప్టర్ 1 బృందానికి  నా ప్రత్యేక అభినందనలు. రిషబ్ శెట్టి సార్ ఒక అద్భుతమైన నటుడిగా మరియు అద్భుతమైన దర్శకుడిగా ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. రిషబ్  శెట్టిని నమ్మి  ఇంతటి భారీ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ తో పాటు ఇతర నటీనటులకు, టెక్నికల్ టీమ్ కు శుభాకాంక్షలు’ అని ఎక్స్ ఖాతాలో  ట్వీట్ చేసారు తారక్. ఇటీవల జరిగిన కాంతార చాప్తర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎన్టీఆర్ ముఖ్యఅతిదిగా విచ్చేసి తన సపోర్ట్ అందించారు. ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సంతోషం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Exit mobile version