NTV Telugu Site icon

Kantara Record: కేజీఎఫ్ రికార్డులను బ్రేక్ చేసిన కాంతార

Kantara Review1

Kantara Review1

Kantara Record: కన్నడ మూవీ కాంతార రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిషబ్ శెట్టి హీరోగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబలే సంస్థ నిర్మించింది. అయితే తాజాగా ఈ చిత్రం కర్ణాటకలో హోంబలే సంస్థ సినిమాల్లో అత్యధికంగా థియేటర్లలో ఎక్కువ మంది చూసిన సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయంలో యశ్ మూవీ కేజీఎఫ్ రికార్డులను వెనక్కి నెట్టింది.

Read Also: Chiranjeevi vs Balayya: చిరు – బాలయ్య పోటీలో ఇదో లెక్క!

అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన కాంతార సినిమా మున్ముందు మరెన్ని రికార్డులను నమోదు చేస్తోందో వేచి చూడాల్సిందే. విడుదలైన పది రోజుల్లోనే హిందీ డబ్బింగ్ వెర్షన్ 24 కోట్లు, తెలుగు వెర్షన్ 23 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సంఖ్యతో, కాంతారా ఇప్పుడు ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ మరియు ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ‘కాంతారా’ అక్టోబర్ 24 వరకు అంటే దీపావళి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 211.5 కోట్ల బిజినెస్ చేసింది.

Read Also: ATMs Golmal: డబ్బులే డబ్బులు.. సిద్దిపేటలో అలా… సంగారెడ్డిలో ఇలా!

తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 15న విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా కాంతార కు బ్రహ్మరథం పడుతున్నారు. మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా గురించి తెల్సుకుని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం కాంతార పాన్ ఇండియా స్థాయిలో కాంతార హవా నడుస్తోంది.