Site icon NTV Telugu

Girl Friend Offer: గర్ల్‌ఫ్రెండ్‌గా మారితే పరీక్షలో పాస్ చేస్తా.. నో చెప్పిన యువతికి ఏమైందంటే?

Girl Friend Offer

Girl Friend Offer

Girl Friend Offer: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టుకు రీకౌంటింగ్ కట్టిన యువతికి విచిత్రమైన ప్రపోజల్ వచ్చింది. పరీక్షలో పాసయ్యేందుకు సహకరిస్తానని చెబుతూ గుర్తుతెలియని వ్యక్తి యువతికి విచిత్రమైన ప్రతిపాదన పెట్టాడు. ‘నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్ అయితే.. పరీక్షలో పాస్ చేస్తా’ అంటూ యువతిని ప్రలోభపెట్టాడు. అంతేకాకుండా రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీనికి యువతి నో చెప్పింది. దీంతో తరచుగా కాల్స్‌ చేస్తూ విసిగించడం ప్రారంభించాడు. వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ.. మెసేజ్‌లు పంపుతూ ఇబ్బందులకు గురి చేశాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Audio Clip Leaked: ఇమ్రాన్ ఖాన్ అశ్లీల ఆడియో క్లిప్ లీక్.. అది ఫేక్ అంటోన్న పీటీఐ

బాధిత యువతి మహరాజ్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తోంది. కాన్పూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుకుంటోంది. ఇటీవల వచ్చిన రిజల్ట్స్‌లో ఆమె గణితం సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయింది. కేవలం 11 మార్కులే వచ్చాయి. దీంతో ఆ సబ్జెక్ట్‌కు రీకౌంటింగ్‌ కట్టింది. నవంబరులో ఆమె మొబైల్‌ నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోను, మెసేజ్‌ వచ్చింది. పరీక్షలో పాస్‌ కావాలనుకుంటే.. నాకు రూ.5 వేలు ఇవ్వు… నా గర్ల్‌ఫ్రెండ్‌గా మారు అంటూ మెసేజ్‌లో ఉంది.  ఆ వ్యక్తి ప్రతిపాదనను యువతి తిరస్కరించింది.తీరా రీకౌంటింగ్ ఫలితాలు చూసుకునే సరికి షాక్. మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో యువతి మళ్లీ ఫెయిల్ అయింది. గతంలో 11 మార్కులు రాగా.. రీకౌంటింగ్‌లో సున్నా వచ్చాయి. ఇది తనకు కాల్ చేసిన వ్యక్తి పనే అన్న అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. గుర్తుతెలియని యువకుడు తనకు మళ్లీ కాల్ చేసి బెదిరించాడని యువతి వాపోయింది. తన భవిష్యత్‌ను నాశనం చేస్తానని చెప్పాడని కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version