NTV Telugu Site icon

Train derail: కేరళలో పట్టాలు తప్పిన కన్నూర్‌-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్..

Train

Train

ఇవాళ తెల్లవారుజామున కేరళలో కన్నూర్-అలప్పుజ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ పట్టాలు తప్పింది. కన్నూర్‌ యార్డులో షంటింగ్‌ ప్రాసెస్‌ (ట్రైన్ దారి మళ్లించే ప్రక్రియ) నిర్వహిస్తుండగా ఈ ఘటన నెలకొంది. రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లిపోయాయి. దీంతో పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైలును అక్కడి నుంచి పంపించారు. ఈ సంఘటన కారణంగా రైలు సుమారుగా గంటన్నర ఆలస్యంగా నడుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ ఉదయం 5.10 గంటలకు కన్నూరు నుంచి బయలుదేరాల్సిన ఈ ట్రైన్.. 6.43 గంటలకు బయలు దేరి వెళ్లింది.

Read Also: North korean : వీడియో చూసినందుకు 12ఏళ్ల జైలు శిక్ష

మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌లోని హౌరా-ఖరగ్‌పూర్ సమీపంలోని నందైగజన్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన నేటి ఉదయం జరిగింది. పొగమంచు కారణంగా పలు లోకల్, సుదూర రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంతలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మరింత ఆలస్యంగా ట్రైన్స్ నడుస్తున్నాయి. ఈ ఘటనతో అప్‌లైన్‌లో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.