Site icon NTV Telugu

Karnataka Anna Bhagya : తలపట్టుకుంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. కేసీఆర్ కు ఫోన్ చేసి

Siddaramaiah Cm Kcr

Siddaramaiah Cm Kcr

ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే కీలకంగా మారాయి. అయితే.. ఈ నేపథ్యంలో అధికారంలోకి రాగా సీఎం సిద్ధరామయ్య మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే రేషన్‌ కార్డులు ఉన్నవారికి ‘అన్నభాగ్య’ పథకం కింద 10 కిలోల ఉచిత బియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. అన్న భాగ్య పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బియ్యం పంపిణీలో పెద్ద సమస్యే వచ్చింది. ఉచిత బియ్యం ఇవ్వడానికి బియ్యం కొనుగోలు చేయడంకోసం సీఎం సిద్దరామయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించారు..తెలంగాణ సీఎం తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడటం జరిగింది.

Balkampet Yellamma Temple : నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు

అన్యభాగ్య పథకం కింద పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణి చెయ్యడానికి తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలు చెయ్యాలని ప్రయత్నించామని, తెలంగాణ సీఎం కేసీఆర్ ను బియ్యం కావాలని అడిగితే మా దగ్గర అంత స్టాక్ లేదని చెప్పారని సీఎం సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం కర్ణాటకలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి 10 కేజీల ఉచిత బియ్యం పంపిణి చెయ్యాలంటే 4.45 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా పథకం కింద 5 కేజీల ఉచిత బియ్యం పంపిణి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కేజీల ఉచిత బియ్యానకి తోడుగా సిద్దరామయ్య ప్రభుత్వం మరో ఐదు కేజీల ఉచిత బియ్యం ఇవ్వాల్సి ఉంది.

Hardeep Singh Nijjar: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హతం.. కెనడాలో కాల్చివేత..

అంటే కర్ణాటక ప్రభుత్వానికి ఇప్పుడు 2.17 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అయ్యింది. తెలంగాణ బియ్యం ఇవ్వడానికి వీలు కాదని చెప్పడంతో సిద్దరామయ్య షాక్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణ పథకాన్ని కర్ణాటకలో నిలిపివేస్తుందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. మొత్తం మీద కర్ణాటకలో ప్రతి ఇంటికి 10 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు బియ్యం చిక్కకపోవడంతో కన్ఫ్యూషన్ లో ఉన్నారు.

Exit mobile version