NTV Telugu Site icon

Darshan : కన్నడ హీరో దర్శన్ మర్డర్ కేసుపై సినిమాలు.. టైటిల్స్ ఏంటో తెలుసా ?

New Project (36)

New Project (36)

Darshan : రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లు కన్నడ స్టార్ హీరో దర్శన్‌పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించినందుకు రేణుకాస్వామిని నటుడు దర్శన్ చంపారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో దర్శన్ తో పాటు పవిత్రగౌడ, మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో దర్శన్ ఈ హత్య చేయించాడనే చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దర్శన్ ని, అరెస్ట్ చేసిన వాళ్లును పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనంగా మారింది. దర్శన్‌కు చెందిన బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లోనే శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. దర్శన్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్న పోలీసులకు శ్రీధర్ మృతదేహంతో పాటు సంఘటనా స్థలంలో ఒక సూసైడ్‌నోట్‌, ఒక వీడియో సందేశాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Read Also:NEET-UG 2024: నీట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా..!

ఈ హత్య కేసుపై దర్శన్ ని అందరూ విమర్శిస్తుంటే.. కొంతమంది మాత్రం సపోర్టు చేస్తున్నారు. దర్శన్ అలాంటివాడు కాదని పలువురు అభిమానులు, అతడి సన్నిహితులు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసుపై సినిమాలు కూడా తీయాలని కొందరు ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి సెలబ్రిటీలు ఏదైనా ఇష్యూలో ఉండి జైలుకి వెళ్తే వారి జీవిత చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. పలువురు ఇలాంటి వాటిపై సినిమాలు కూడా తీస్తారు. ఈ క్రమంలోనే దర్శన్ జీవితం, దర్శన్ గతంలో కూడా పలుమార్లు జైలు పాలైన సంగతులు, ఇప్పటి హత్య కేసు అన్నింటిని మిళితం చేసి సినిమాలు తీయాలని కన్నడ ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ ఫిలిం ఛాంబర్ లో దర్శన్ హత్య కేసుపై సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ కూడా రిజిస్టర్ చేయమని వెళ్లారట. D గ్యాంగ్, ఖైదీ నెంబర్ 6106 లాంటి టైటిల్స్ రిజిస్టర్ చేయాలని పలువురు కోరారట. మరి త్వరలోనే దర్శన్ హత్య కేసుపై సినిమా వస్తుందేమో చూడాలి.

Read Also:Srichakra Milk Products: ‘శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరో!