బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఈ ఉత్తర్వును విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) సలహా బోర్డు ఆమోదించింది. ఇందులో రన్యా రావుతో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వు ప్రకారం, ఒక సంవత్సరం జైలు శిక్ష కాలంలో ముగ్గురూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కోల్పోయారు. అంటే, వారిలో ఎవరూ మొత్తం శిక్షా కాలంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేరు.
Also Read:Off The Record: విశాఖ ఎంపీ శ్రీభరత్ ని అభాసుపాలు చేస్తున్న ఆ ఒక్క బలహీనత..!
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన ‘మాణిక్య’ సినిమాలో నటించిన ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇతర దక్షిణ భారత చిత్రాలలో కూడా నటించింది. ఈ ఏడాది మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారంతో రణ్య రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది. రణ్య తరచుగా అంతర్జాతీయ పర్యటనలు చేస్తున్నందున ఆమెపై DRI నిఘా పెట్టింది. మార్చి 3న రాత్రి ఆమె దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో బెంగళూరుకు చేరుకున్న సమయంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read:Chandu Naik Murder: సీపీఐ నాయకుడు చందూ నాయక్ వెలుగులోకి సంచలన విషయాలు..!
నటి రన్యా రావు ఎక్కువ బంగారం ధరించిందని, ఆమె తన దుస్తులలో బంగారు కడ్డీలను కూడా దాచిపెట్టిందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. రన్యా స్టెప్ ఫాదర్ రామచంద్రరావు సీనియర్ ఐపీఎస్ అధికారి. విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, రన్యా తనను తాను ఐపీఎస్ అధికారి కుమార్తెగా పరిచయం చేసుకునేదని, స్థానిక పోలీసు సిబ్బందికి ఫోన్ చేసి ఆమెను ఇంటి వద్ద దింపాలని కోరేదని డిఆర్ఐ తెలిపింది.
Also Read:Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు దానం మనసు మళ్లుతోందా..?
రన్యా రావుపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈసీఐఆర్ దాఖలు చేసింది. జూలై 4న, ఈడీ ఆమెపై చర్య తీసుకుని బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్‌లోని ఒక ఇల్లు, బెంగళూరులోని అర్కావతి లేఅవుట్‌లోని ఒక ప్లాట్, తుమకూరులోని ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తులన్నింటి మొత్తం విలువ దాదాపు రూ.34.12 కోట్లు.
